ETV Bharat / bharat

ప్రియుడి కోసం లింగమార్పిడి చేసుకున్న యువకుడు.. చివరకు! - male to female surgery

ముంబయికి చెందిన జమాల్​ అనే వ్యక్తి.. ప్రేమ కోసం ఏకంగా తన లింగాన్నే మార్చేసుకున్నాడు. ప్రియుడు ఫుర్​ఖాన్​ చెప్పినట్టు ఆపరేషన్​ చేయించుకున్నాడు. ఆ తర్వాత జీవితం ఆనందంగా ఉంటుందని అనుకున్న జమాల్​కు షాక్​ తగిలింది. శిల్పగా మారిన జమాల్​ను ప్రియుడు విడిచిపెట్టి వెళ్లిపోయాడు.

sex change surgery
ప్రియుడి కోసం లింగమార్పిడి చేసుకున్న అబ్బాయి.. చివరకు!
author img

By

Published : Nov 12, 2021, 8:01 PM IST

Updated : Nov 13, 2021, 7:22 AM IST

ప్రియుడి కోసం లింగమార్పిడి చేసుకున్న యువకుడు

ప్రపంచంలో ఎన్నో గొప్ప ప్రేమకథలు చరిత్రలో నిలిచిపోయాయి. వాటిల్లో కొన్ని కథలు సుఖాంతమైతే, మరికొన్ని తీవ్ర దుఃఖాన్ని మిగిల్చాయి. అలాంటి ప్రేమకథలు రోజువారీ జీవితంలో ఎన్నో వింటుంటాము. కానీ ముంబయిలో వెలుగుచూసిన ప్రేమకథ మాత్రం వాటన్నింటికీ భిన్నం. ప్రేమ కోసం, ప్రేమికుడితో సంతోషంగా ఉండటం కోసం.. ఓ వ్యక్తి ఏకంగా తన లింగాన్నే మార్చేసుకున్నాడు! చివరకు ఆ ప్రేమికుడి చేతిలో మోసపోయాడు.

ప్రియుడి మాటలు నమ్మి...

Mumbai's Jamal changed sex for marriage but lover cheated
ఆపరేష్​కు ముందు జమాల్​ ఫొటో

15 ఏళ్ల వయస్సులోనే కోల్​కతా నుంచి కుటుంబంతో పాటు ముంబయికి వచ్చాడు జమాల్ షేక్​​. ఏడాదిన్నర క్రితం ఫుర్​ఖాన్​ షేక్​తో ప్రేమలో పడ్డాడు. లింగ మార్పిడి చేసుకోవాలని, ఆ తర్వాత ఎంతో ప్రేమగా చూసుకుంటానని జమాల్​కు మాటిచ్చాడు ఫుర్​ఖాన్​. ఆ మాటలను నమ్మి రెండు లక్షల రూపాయలు వెచ్చించి ఆపరేషన్​ చేయించుకున్నాడు 31ఏళ్ల జమాల్​. ఆ తర్వాత తన పేరును శిల్పగా మార్చుకున్నాడు.

ప్రియుడు ఫుర్​ఖాన్​తో జమాల్​

లింగ మార్పిడి చేసుకున్న తర్వాత తన జీవితం మారిపోతుందని, ఫుర్​ఖాన్​ చెప్పినట్టు సంతోషంగా ఉండొచ్చని కలలు కన్న జమాల్​కు ఊహించని రీతిలో షాక్​ తగిలింది. జమాల్​ను ఫుర్​ఖాన్​ మోసం చేశాడు. ముంబయిని విడిచిపెట్టి వెళ్లిపోయాడు. దీంతో జమాల్​ దిక్కుతోచని స్థితిలో పడ్డాడు.

జమాల్​ అలియాస్​ శిల్ప

శిల్ప- ఫుర్​ఖాన్​

"తను నా బాయ్​ఫ్రండ్​. అతడి కోసం లింగమార్పిడి చేసుకున్నాను. జీవితం మొత్తం నాకు అండగా ఉంటానని చెప్పాడు. అందుకే ఆపరేషన్​ చేసుకున్నా. కానీ నన్ను మోసం చేస్తాడని అనుకోలేదు. నా నుంచి 2లక్షల రూపాయలు తీసుకుని వెళ్లిపోయాడు. అతడితో నేను ఏడాదిన్నర పాటు రిలేషన్​లో ఉన్నాను. ఇక్కడి నుంచి దిల్లీకి వెళ్లిపోయాడు. అక్కడి నుంచి నాతో మాట్లాడేవాడు. డబ్బులు కావాలని అడిగిన ప్రతిసారీ నేను ఇచ్చాను."

-- శిల్పగా మారిన జమాల్​

ఫుర్​ఖాన్​కు ఇంతకుముందే వివాహం జరిగిందని తెలిసినా, నిజంగా తనను ప్రేమించాడు అనుకుని మోసపోయినట్టు జమాల్​ తెలిపాడు. లింగ మార్పిడి తర్వాత తన తల్లిందండ్రులు కూడా తనను స్వీకరించలేకపోతున్నారని చెప్పాడు. ఇప్పుడు తనకు కుటుంబం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

తనకు న్యాయం జరగాలని పోలీసులను ఆశ్రయించినా.. వారు తన కేసును తీసుకోవడం లేదని జమాల్​ తెలిపాడు. మీడియా మద్దతుతో న్యాయం కోసం పోరాడాలని నిర్ణయించుకున్నట్టు ​ వివరించాడు.

ఇవీ చూడండి:- షరియా చట్టం ఉల్లంఘన... వివాహేతర జంటకు కఠిన శిక్ష!

Last Updated : Nov 13, 2021, 7:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.