ETV Bharat / bharat

మహారాష్ట్రలో 18 వేలు- బంగాల్​లో 9 వేల కొత్త కరోనా కేసులు

Mumbai Covid Cases: భారత్​లో మళ్లీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఒక్క ముంబయిలోనే 10 వేలకుపైగా కేసులు వెలుగుచూశాయి. బంగాల్​లో ఒక్కరోజే 9 వేలమందికి పైగా వైరస్​ సోకింది. దిల్లీలో 5,481, కేరళలో 3,640, కర్ణాటకలో 2,479 కేసులు నమోదయ్యాయి.

Mumbai Covid Cases
ముంబయిలో కరోనా కేసులు
author img

By

Published : Jan 4, 2022, 8:27 PM IST

Updated : Jan 4, 2022, 9:12 PM IST

Mumbai Covid Cases: ఓవైపు ఒమిక్రాన్​ వేరియంట్​ విజృంభణతో ప్రపంచ దేశాలు వణికిపోతుంటే.. భారత్​లో కరోనా కేసులు మళ్లీ ఆందోళన కలిగిస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వేలాదిగా కొత్త కేసులు నమోదవుతున్నాయి.

ముంబయిలో మంగళవారం ఒక్కరోజే 10 వేల 860 కేసులు వెలుగులోకి వచ్చాయి. మొత్తంగా మహారాష్ట్రలో 18,466 మందికి వైరస్​ సోకింది. 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో మొత్తం ఒమిక్రాన్​ కేసుల సంఖ్య 653కు చేరింది.

ఇతర రాష్ట్రాల్లో ఇలా..

  • Delhi corona cases: దిల్లీలోనూ కొవిడ్​ కేసులు భారీగా పెరిగాయి. కొత్తగా 5,481 మంది వైరస్​ బారినపడ్డారు. పాజిటివిటి రేటు 8.37 శాతానికి చేరినట్లు వైద్యాధికారులు తెలిపారు.
  • బంగాల్​లోనూ కరోనా విజృంభిస్తోంది. మంగళవారం 9,073 మందికి వైరస్​ సోకింది. 3,768 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 16 మంది వైరస్​ కారణంగా చనిపోయారు.
  • కేరళలో 3,640 కొత్త కేసులు.. ప్రభుత్వం సవరించిన దాని ప్రకారం 453 మరణాలు సంభవించాయి. అయితే ఈ ఒక్కరోజు 30 మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 52,49,489కి చేరింది. ఇప్పటివరకు 48,637 మంది కొవిడ్​కు బలయ్యారు.
  • తమిళనాడులో కొత్తగా 2,731 మందిలో వైరస్​ నిర్ధరణ అయ్యింది. మరో 9 మంది చనిపోయారు. 674 మంది కోలుకున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. యాక్టివ్​ కేసుల సంఖ్యం 12,412 గా ఉంది.
  • గుజరాత్​లో కొత్తగా 2,265 వైరస్​ కేసులు నమోదు అయ్యాయి. 240 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇద్దరు చనిపోయిట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం 7,800 యాక్టివ్​ కేసులు ఉన్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
  • కర్ణాటకలో కొవిడ్​ బాధితుల సంఖ్య మరింత పెరిగింది. రాష్ట్రంలో 2,479 కొత్త కేసులు, నాలుగు మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 30,13,326, మరణాలు 38,355కు చేరాయి.
  • నార్త్ బంగాల్​లో మెడికల్​ కాలేజీలో 19 కొత్త కేసులు నమోదయ్యాయి. వారిలో నలుగురు విద్యార్థులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. పంజాబ్​ లూథియానాలోని డీఎంసీ నర్సింగ్​ కాలేజీలో 41 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. వీరిలో 23 మంది ఆసుపత్రిలో చేరినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది.
  • వైరస్​ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని ఊరేగింపులు, ర్యాలీలు, బహిరంగ సభలు, సామాజిక, సాంస్కృతిక క్రీడా కార్యక్రమాలపై నిషేధం విధించినట్లు ఛత్తీస్​గఢ్​ ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. రాష్ట్రంలోని రైల్వే స్టేషన్‌లు, సరిహద్దుల్లో వైరస్​ పరీక్షలు చేస్తున్నారు. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఆసుపత్రిలో పడకలను, మందులను సిద్ధం చేశారు.
  • ఝూర్ఖండ్​లోని రాంచీ ఎయిర్​ పోర్ట్​లో ఉచితంగా కొవిడ్​ పరీక్షలను జరుపుతున్నారు. ప్రయాణికులు ఎవరైనా 72 గంటల లోపు ఆర్​టీపీసీఆర్​ నెగెటివ్​ రిపోర్ట్ లేదా వ్యాక్సినేషన్​ రిపోర్ట్​ను చూపిస్తే వారికి మాత్రమే పరీక్షల నుంచి మినహాయింపు ఇస్తున్నారు.

ఇదీ చూడండి: ఐఐటీ ఖరగ్​పుర్​లో కరోనా కలకలం- ఆ 60 మందికి..

Last Updated : Jan 4, 2022, 9:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.