మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు(Anil Deshmukh News) 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది ముంబయి కోర్టు. దేశ్‌ముఖ్‌ను విచారించేందుకు మరో 9 రోజులు రిమాండ్ కావాలని ఈడీ అధికారులు చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది.
అనిల్ దేశ్‌ముఖ్‌ను(Anil Deshmukh News) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఈనెల 2వ తేదీ అర్ధరాత్రి అరెస్టు చేసింది. మనీలాండరింగ్ కేసులో 12 గంటలపాటు ప్రశ్నించిన అధికారులు.. అనంతరం ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో అనిల్ దేశ్ముఖ్తో పాటు కుందన్ షిందే, సంజీవ్ పలాండేలను సైతం ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వాళ్లు జ్యుడీషియల్ కస్టడీలోనే ఉన్నారు.
బార్లు, రెస్టారెంట్ల నుంచి ప్రతి నెల రూ.100కోట్లు వసూలు చేయాలని పోలీసు అధికారులపై దేశ్‌ముఖ్(Anil Deshmukh News) ఒత్తిడి తెచ్చినట్లు ముంబయి మాజీ సీపీ పరంబీర్ సింగ్ ఆరోపించారు. ఈ ఆరోపణలపై విచారణ జరిపిన కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ఆయనపై కేసు నమోదు చేసింది. సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఆయనపై చర్యలు చేపట్టింది.
ఇదీ చూడండి: ''రివర్స్ గేర్'లో మోదీ అభివృద్ధి వాహనం'