Gaming Addiction: మహారాష్ట్ర ముంబయిలో ఓ 14 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. అయితే గేమింగ్ వ్యసనం కారణంగానే అతడు సూసైడ్ చేసుకొని ఉంటాడని అనుమానిస్తున్నారు పోలీసులు.
ఏం జరిగిందంటే?
సెంట్రల్ ముంబయిలోని భోయ్వాడా ప్రాంతంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో తల్లి, సోదరి లేని సమయంలో సూసైడ్ చేసుకున్నాడు బాలుడు. దానికి ముందు అతడు తన తండ్రికి కాల్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆయన డ్రైవింగ్‌లో ఉండటం వల్ల కాల్ లిఫ్ట్ చేయలేదు.
తల్లిదండ్రులు ఇంటికి తిరిగి వచ్చేసరికి బాలుడి గది.. లోపలి నుంచి మూసి ఉంది. తలుపులను పగలగొట్టి చూడగా, బాలుడి వేలాడబడి ఉన్నాడు. అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధరించారు.
బాలుడు చదువులో, క్రికెట్లో బాగా రాణించేవాడని తెలుస్తోంది. అయితే గేమింగ్‌కు అలవాటు పడటమే ఆత్మహత్యకు దారితీసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అదే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: భాజపా కార్యాలయంలోనే హెడ్‌కానిస్టేబుల్ ఆత్మహత్య