ETV Bharat / bharat

గోడ కూలి ఇద్దరు మృతి.. ముగ్గురి పరిస్థితి విషమం

labour died in ghaziabad: ఘజియాబాద్​లోని విజయనగర్​లో ఓ గోడ కూలిన ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే చనిపోయారు. మరో ముగ్గురికి తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

multiple labourers buried
గోడ కూలి ఇద్దరు మృతి
author img

By

Published : Mar 23, 2022, 10:33 AM IST

Updated : Mar 23, 2022, 11:33 AM IST

labour died in ghaziabad: దిల్లీ సరిహద్దుల్లో ఉండే ఘాజియాబాద్​లోని విజయనగర్​లో ఓ విషాద ఘటన జరిగింది. నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఇద్దరు వలస కూలీలు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. గోడ నిర్మాణం జరుగుతున్నప్పుడు ఈ స్థలంలో 16 మంది కూలీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే సుమారు రాత్రి రెండు గంటల ఆ ప్రాంతంలో గోడ ఒక్కసారిగా కుప్పకూలిందని పేర్కొన్నారు.

దీనిపై పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. ఘటనా స్థలానికి చేరుకుని కూలీలను రక్షించారు. అనంతరం గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే ఎంతమంది చనిపోయారనే విషయాన్ని మాత్రం అధికారులు ఇంకా ధ్రువీకరించలేదు. గాయపడిన కూలీలు బిహార్​ చెందిన వారుగా అధికారులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని విషయాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:

రూ.8,357కోట్లతో రక్షణ ఉత్పత్తుల కొనుగోలుకు కేంద్రం ఆమోదం

Last Updated : Mar 23, 2022, 11:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.