ETV Bharat / bharat

Mukesh Ambani Gets Death Threat : ముకేశ్‌ అంబానీకి మరోసారి బెదిరింపులు.. రూ.20 కోట్లు ఇవ్వకపోతే.. - Mukesh Ambani death threat email

Mukesh Ambani Gets Death Threat : రిలయన్స్‌ ఇండస్ట్రీస్​ అధినేత ముకేశ్ అంబానీకి మరోసారి బెదిరింపులు వచ్చాయి. రూ.20 కోట్లు ఇవ్వాలని.. లేదంటే కాల్చి చంపేస్తామని మెయిల్‌లో గుర్తుతెలియని వ్యక్తులు పేర్కొన్నారు.

mukesh ambani threat
mukesh ambani threat
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 28, 2023, 10:27 AM IST

Updated : Oct 28, 2023, 10:52 AM IST

Mukesh Ambani Gets Death Threat : ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్‌ ఇండస్ట్రీస్​ అధినేత ముకేశ్ అంబానీకి మరోసారి బెదిరింపులు రావడం కలకలం రేపింది. అంబానీ కంపెనీకి చెందిన ఓ ఈ-మొయిల్‌ ఐడీకి శుక్రవారం.. గుర్తుతెలియని వ్యక్తి నుంచి బెదిరింపు మెయిల్ వచ్చింది. "మా దగ్గర మంచి షూటర్లున్నారు. రూ.20కోట్లు ఇవ్వకపోతే చంపేస్తాం" అని ఆ మెయిల్‌లో ఆగంతకులు బెదిరింపులకు పాల్పడ్డారు.

Mukesh Ambani Death Threat : దీంతో ముకేశ్ అంబానీ సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్‌ ముంబయి గామ్‌దేవీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. షాదాబ్ ఖాన్‌ అనే వ్యక్తి నుంచి ఆ బెదిరింపు మెయిల్‌ వచ్చినట్లు గుర్తించారు. అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

అంబానీ ఇంటర్నేషనల్​ స్కూల్​ను పేల్చేస్తామని..
కొన్ని నెలల క్రితం.. ముంబయిలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్​ స్కూల్​ను పేల్చేస్తామని కాల్​ చేసి బెదిరించాడు ఓ వ్యక్తి. జనవరి 10వ తేదీన నిందితుడు.. స్కూల్​కు బాంబు బెదిరింపు కాల్ చేశాడు. స్కూల్​ను పేల్చేస్తామని బెదిరించాడు. స్కూల్​ ల్యాండ్​లైన్ నెంబర్​కు ఈ కాల్ వచ్చిందని పోలీసులు తెలిపారు. పాఠశాలలో టైమ్ బాంబ్ పెట్టానని ఫోన్​లో చెప్పి నిందితుడు కాల్ కట్ చేశాడని చెప్పారు. బెదిరింపు కాల్ రాగానే స్కూల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వెంటనే దర్యాప్తు చేపట్టారు. బాంబ్​ స్క్వాడ్​ను రంగంలోకి దించి తనిఖీలు నిర్వహించారు. పాఠశాలలో ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకలేదని పోలీసులు స్పష్టం చేశారు.

గతంలో కూడా..
రిలయన్స్ గ్రూప్​నకు అనేకసార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయి. గతేడాది అక్టోబర్​లో రిలయన్స్‌ ఫౌండేషన్‌ హాస్పిటల్‌కు ఓ వ్యక్తి కాల్ చేసి.. ఆస్పత్రిని పేల్చేస్తామని బెదిరించాడు. అంబానీ కుటుంబానికి చెందిన కొంతమంది సభ్యుల పేర్లు చెప్పి మరీ బెదిరింపులకు పాల్పడ్డాడు. అదే ఏడాది ఆగస్టు 15న కూడా అంబానీ కుటుంబానికి బెదిరింపులు వచ్చాయి. అంబానీతో పాటు ఆయన కుటుంబాన్ని 3 గంటల్లో చంపేస్తామని ఓ ఆగంతుకుడు ఫోన్ చేశాడు.

Last Updated : Oct 28, 2023, 10:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.