ETV Bharat / bharat

మహిళ మెడలో గొలుసు కొట్టేస్తూ దొరికిన 'మిస్టర్ ఇండియా'! - చైన్ స్నాచర్ అరెస్ట్

Mr India title winner arrested: చైన్​ స్నాచింగ్​కు పాల్పడిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. గతంలో బాడీ బిల్డింగ్​లో రాణించి, మిస్టర్ ఇండియా టైటిల్ గెలుచుకున్న నిందితుడు అప్పులను తీర్చేందుకు ఈ చోరీలకు పాల్పడ్డాడని తెలిసింది.

chain snacher faizal
చైన్ స్నాచర్ మహ్మద్ ఫైజల్
author img

By

Published : Mar 21, 2022, 2:49 PM IST

Mr India title winner arrested: మహిళ మెడలో నుంచి గొలుసును దోచుకున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన చెన్నైలో జరిగింది. మార్చి 17న రత్నా దేవి(58) మెడలోని గొలుసును కొట్టేసిన నిందితుడిని సీసీటీవీ ఫుటేజ్​ ఆధారంగా గుర్తించామని పోలీసులు తెలిపారు.

cctv in accused
సీసీటీవీ ఫుటేజ్​లో నమోదైన నిందితుడి ఫోటోలు

ఆర్థిక అవసరాలే కారణం..

చెన్నైలోని మన్నాడి ప్రాంతానికి చెందిన మహ్మద్ ఫైజల్ బీటెక్ రెండేళ్ల క్రితం పూర్తి చేశాడు. చదువు పూర్తయ్యాక మొబైల్స్​ వ్యాపారాన్ని ప్రారంభించాడు. కొవిడ్ సమయంలో వ్యాపారంలో నష్టాలు చవిచూశాడు. రుణదాతల బాకీని తిరిగి చెల్లించలేక ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు చోరీల బాట పట్టాడని తెలిసింది. ఫైజల్ స్వతహాగా బాడీ బిల్డర్. 2019వ సంవత్సరంలో బాడీ బిల్డింగ్​లో మిస్టర్ ఇండియా టైటిల్​ గెలుచుకున్నాడు.

ఇదీ చదవండి: తాగిన మైకంలో నాలుగేళ్ల కుమారుడిని సజీవంగా పూడ్చిన తండ్రి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.