ETV Bharat / bharat

మరో ఇద్దరు ఎంపీలపై వేటు- కొనసాగుతున్న సస్పెన్షన్ల పర్వం

MPs Suspended From Lok Sabha : లోక్​సభలో మరో ఇద్దరు ఎంపీలపై వేటు పడింది. సభలో ప్లకార్డులు ప్రదర్శించిన కారణంగా థామ్స్​ ఛాళిక్డన్​, ఏఎమ్​ ఆరిఫ్​ను శీతాకాల సమావేశాలు ముగిసేంత వరకు సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉభయ సభల్లో కలిపి సస్పెన్షన్​కు గురైన ఎంపీల సంఖ్య 143కు చేరింది.

MPS Suspended From Lok Sabha
MPS Suspended From Lok Sabha
author img

By PTI

Published : Dec 20, 2023, 3:06 PM IST

Updated : Dec 20, 2023, 4:17 PM IST

MPs Suspended From Lok Sabha : లోక్​సభలో ఎంపీల సస్పెన్షన్​ పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే 95 మందిని సస్పెండ్ చేయగా బుధవారం మధ్యాహ్నం మరో ఇద్దరిపై వేటు పడింది. సభలో ప్లకార్డులు ప్రదర్శించిన కారణంగా థామ్స్​ ఛాళిక్డన్​, ఏఎమ్​ ఆరిఫ్​ను శీతాకాల సమావేశాలు ముగిసేంత వరకు సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర హోంమంత్రి పార్లమెంట్​లో ప్రకటన చేయాలని కోరామని, దీనిపై సభలో నిరసన తెలిపగానే తమను సస్పెండ్ చేశారని ఏఎమ్​ అరిఫ్​ తెలిపారు. ప్రస్తుతం ఉభయ సభల్లో కలిపి సస్పెన్షన్​కు గురైన ఎంపీల సంఖ్య 143కు చేరింది.

  • #WATCH | On his suspension for the winter session, Lok Sabha MP AM Ariff says, "We had demanded Union Home Minister to make a statement in Parliament. We protested in the House. Then, we were suspended." pic.twitter.com/C9yyRPQ2N7

    — ANI (@ANI) December 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

సభలో నిల్చుని ఎన్​డీఏ సభ్యుల సంఘీభావం
మరోవైపు.. పార్లమెంట్‌ ప్రాంగణంలో ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ను అనుకరిస్తూ తృణమూల్‌ ఎంపీ కల్యాణ్‌ బెనర్జీ వ్యవహరించిన తీరును ఎన్​డీఏ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ధన్‌ఖడ్‌కు మద్దతుగా అధికారపక్ష ఎంపీలు బుధవారం రాజ్యసభలో కొద్దిసేపు నిల్చునే సభా కార్యకలాపాల్లో పాల్గొన్నారు.

MPS Suspended From Lok Sabha
నిల్చుని సంఘీభావం చెబుతున్న ఎన్​డీయే సభ్యులు

"ఈ ఘటనను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. వారు (విపక్షాలు) అన్ని హద్దులను దాటుతున్నారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులను పదే పదే అవమానిస్తున్నారు. గత 20 ఏళ్లుగా ప్రధాని మోదీ ఇలాంటి అవమానాలే ఎదుర్కొంటున్నారు. రాజ్యాంగాన్ని, ఉపరాష్ట్రపతిని అవమానిస్తే సహించేది లేదు. మీ మీద గౌరవంతో వారు చేసిన చర్యలకు నిరసనగా ఈ ప్రశ్నోత్తరాల గంట మొత్తం నిలబడే పాల్గొంటాం."

--ప్రహ్లాద్‌ జోషీ, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి

ఎన్​డీఏ ఎంపీలంతా నిలబడి ఉండగా కొన్ని నిమిషాల పాటు ప్రశ్నోత్తరాల గంట కొనసాగింది. ఆ తర్వాత స్పందించిన ఛైర్మన్‌ ధన్‌ఖడ్‌, "మీ సంఘీభావం నా మనసును తాకింది. మీరంతా కూర్చోవాలని కోరుతున్నా" అని అన్నారు. ఫలితంగా అధికారపక్ష ఎంపీలంతా వారి సీట్లలో కూర్చుని సభా కార్యకలాపాల్లో పాల్గొన్నారు.

జంతర్​ మంతర్​ వద్ద మాక్​ పార్లమెంట్​!
సస్పెన్షన్​కు గురైన విపక్ష ఎంపీలు గురువారం జంతర్​ మంతర్​ వద్ద నిరసన చేపట్టనున్నారు. 140 మందికి పైగా ఎంపీలు మోక్​ పార్లమెంట్​ను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఆర్​జేడీ ఎంపీ మనోజ్​ ఝా ఈ మాక్​ పార్లమెంట్​ స్పీకర్​గా పనిచేయనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి బుధవారం సాయంత్రం పార్లమెంట్ కాంప్లెక్స్​లోని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఛాంబర్​లో సమావేశమై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

మిమిక్రీపై స్పందించిన రాహుల్​ గాంధీ
మరోవైపు పార్లమెంట్ ఆవరణలో ఉపరాష్ట్రపతిని అనుకరించిన ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఎంపీలందరూ పార్లమెంట్ ఆవరణలో కూర్చోగా తాను వీడియో తీశానని, అది తన ఫోన్​లోనే ఉందని చెప్పారు.

  • VIDEO | "Who disrespected and how? MPs were sitting there (in the Parliament premises), I shot their video. Our 150 MPs were thrown out, but there is no discussion in the media on that; no discussion on Adani, Rafael and unemployment," says Congress leader @RahulGandhi in… pic.twitter.com/u72anELdBP

    — Press Trust of India (@PTI_News) December 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఎవరు? ఎవరిని అవమానించారు. సుమారు 150 మంది మా ఎంపీలను బయటకు పంపించారు. వారి గురించి ఏ మీడియాలో కూడా చర్చ లేదు. అదానీ, రఫేల్​, నిరుద్యోగంపై ఎలాంటి చర్చ లేదు. మా ఎంపీలు బయట కూర్చుంటే, మీరు మిమిక్రీ గురించి మాట్లాడుతున్నారు. మీడియా సంస్థలు కొన్ని వార్తలను చూపించాలి. అది వారి బాధ్యత."

--రాహుల్ గాంధీ, కాంగ్రెస్​ ఎంపీ

పార్లమెంటులో భద్రతా వైఫల్యంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రకటన చేయాలనే డిమాండ్‌తో ఉభయ సభల్లో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఫలితంగా ఇప్పటి వరకు మొత్తం 143 మంది సభ్యులు సస్పెన్షన్​కు గురయ్యారు. దీనిపై విపక్షాలు భగ్గుమన్నాయి. సస్పెన్షన్‌కు గురైన సభ్యులు పార్లమెంటు భవన మెట్లపై కూర్చొని నిరసన చేపట్టారు. ఈ క్రమంలోనే ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ను అనుకరిస్తూ తృణమూల్‌ నేత కల్యాణ్‌ బెనర్జీ చేసిన వ్యంగ్య ప్రదర్శనను కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ తన ఫోన్​లో చిత్రీకరించారు. ఆ తర్వాత మరికొందరు నేతలు స్పీకర్‌ను అనుకరించారు. ఈ ఘటన తనను బాధించిందని ధన్‌ఖడ్‌ పేర్కొన్నారు.

'ఉపరాష్ట్రపతిని పార్లమెంట్​ కాంప్లెక్స్​లో అవమానించడం బాధాకరం'- మిమిక్రీ ఘటనపై మోదీ కౌంటర్

పార్లమెంట్​లో ఆగని నిరసనలు- మరో 49మంది లోక్​సభ ఎంపీలపై సస్పెన్షన్​ వేటు

Last Updated : Dec 20, 2023, 4:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.