ETV Bharat / bharat

మద్యం తాగించి యువతిపై గ్యాంగ్ రేప్​ - మహిళపై అత్యాచారం

మధ్యప్రదేశ్​లోని ఓ యువతికి బలవంతంగా మద్యం తాగించి అఘాయిత్యానికి ఒడిగట్టారు నలుగురు కిరాతకులు. రెండు రోజుల పాటు అత్యాచారం చేసి నరకం చూపించారు. ఈ కేసులో ఓ భాజపా కార్యకర్త ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

MP: Woman forced to drink liquor, gang-raped in farmhouse
బలవంతంగా మద్యం తాగించి.. రెండు రోజులు అత్యాచారం
author img

By

Published : Feb 21, 2021, 10:15 PM IST

Updated : Feb 21, 2021, 11:24 PM IST

ఓ యువతికి బలవంతంగా మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్​ శహడోల్​ జిల్లాలో జరిగింది. బాధితురాలిని అపహరించిన నలుగురు కిరాతకులు.. వాహనంలో జైత్​పుర్​ పోలీసు స్టేషన్​ పరిధిలోని గడఘాట్​ ప్రాంతంలోని ఫాంహౌస్​కి తీసుకెళ్లారు. రెండు రోజుల(ఫిబ్రవరి18,19)పాటు చిత్రహింసలకు గురి చేసి అఘాయిత్యానికి ఒడిగట్టారని ఏఎస్​పీ ముకేశ్​ వైశ్​ తెలిపారు.

మరుసటి రోజు(ఫిబ్రవరి 20న) బాధితురాలిని ఆమె ఇంటి ముందే దించి వెళ్లారని ముకేశ్​ పేర్కొన్నారు. ఆమెను తొలుత జైత్​పుర్​ ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లినట్లు పేర్కొన్న ఏఎస్​పీ.. అనంతరం జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

కేసులో భాజపా కార్యకర్త..

నిందితుల్లో ఒకరు భాజపాకు చెందిన వ్యక్తిగా గుర్తించామని తెలిపారు పోలీసులు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన క్రమంలో సదరు వ్యక్తిని పార్టీ నుంచి బహిష్కరించినట్లు భాజపా వర్గాలు తెలిపాయి. అతని ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసినట్లు వెల్లడించాయి.

ఇదీ చూడండి: ఐదేళ్ల చిన్నారిపై టీనేజీ బాలుడు అత్యాచారం

Last Updated : Feb 21, 2021, 11:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.