ETV Bharat / bharat

ఆక్సిజన్​ తొలగించిన వార్డ్​ బాయ్​- కొవిడ్​ రోగి మృతి!

కొవిడ్ ఆసుపత్రిలో వార్డు బాయ్​ క్రూరత్వానికి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అతనికి ఆక్సిజన్​ కనెక్షన్​ తొలగించడమే కారణం. మధ్యప్రదేశ్​ శివపురిలోని జిల్లా ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది.

Ward Boy removes oxygen
కరోనా రోగికి ఆక్సిజన్​ తొలగించిన వార్డ్​ బాయ్
author img

By

Published : Apr 15, 2021, 1:39 PM IST

కరోనా రోగికి ఆక్సిజన్​ తొలగించిన వార్డ్​ బాయ్

మధ్యప్రదేశ్​లోని శివపురి​ జిల్లాలో కొవిడ్ ​వ్యాధిగ్రస్థుడికి ఉన్న ఆక్సిజన్ కనెక్షన్​ను వార్డు బాయ్​ తొలగించాడు. దాంతో.. సదరు రోగి విలవిల్లాడుతూ మృతి చెందాడు. సంబంధిత దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.

కరోనాతో రెండు రోజుల క్రితం ఆసుపత్రిలో చేరిన సురేంద్ర శర్మ అనే రోగి బుధవారం ప్రాణాలు కోల్పోయాడని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

''మా తండ్రి శ్వాస సమస్యతో బాధపడుతున్నారు. దీంతో ఆసుపత్రి వైద్యులు ఆక్సిజన్​ అందించారు. కానీ మంగళవారం రాత్రి మా నాన్నకు ఆక్సిజన్​ను తొలగించారు. ఆక్సిజన్​ను అందించాలని నేను అక్కడికి వెళ్లి ప్రాధేయపడ్డాను. కానీ ఆసుపత్రి సిబ్బంది నిరాకరించారు. శ్వాస అందకనే మా తండ్రి మరణించారు.''

-బాధితుని కుమారుడు

ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు ఆసుపత్రి యాజమాన్యాన్ని డిమాండ్​ చేశారు. ముగ్గురు డాక్టర్లతో కూడిన బృందాన్ని దర్యాప్తునకు ఆదేశించినట్లు ఆసుపత్రి ఉన్నతాధికారి అర్జున్​ లాల్​ శర్మ చెప్పారు.

ఆక్సిజన్​ కొరత ఉందనే ఆరోపణలను ఆసుపత్రి యాజమాన్యం ఖండించింది. కావాల్సినంత ప్రాణవాయువు​ ఉందని తెలపింది. దోషులకు శిక్ష పడేలా చూస్తామని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: పోలింగ్​కు ముందు కాంగ్రెస్​ అభ్యర్థి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.