ETV Bharat / bharat

'లవ్ జిహాద్' ఆర్డినెన్స్ తెచ్చిన మధ్యప్రదేశ్​

బలవంతపు మతమార్పిళ్లను అడ్డుకునేలా రూపొందించిన మతస్వేచ్ఛ బిల్లును ఆర్డినెన్సు రూపంలో తీసుకొచ్చింది మధ్యప్రదేశ్. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రద్దైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Madhya Pradesh govt passes anti-conversion law
'లవ్ జిహాద్' బిల్లుకు ఆర్డినెన్సు రూపం
author img

By

Published : Dec 29, 2020, 12:47 PM IST

బలవంతపు మత మార్పిళ్లకు వ్యతిరేకంగా రూపొందించిన 'లవ్​ జిహాద్' బిల్లును ఆర్డినెన్సు రూపంలో తీసుకొచ్చింది మధ్యప్రదేశ్ సర్కార్. కరోనా కారణంగా అసెంబ్లీ సమావేశాలు రద్దైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్డినెన్సును గవర్నర్ సమ్మతి కోసం పంపించింది.

వివాహాలు, ఇతర మార్గాల ద్వారా బలవంతంగా మత మార్పిడికి పాల్పడితే పదేళ్ల వరకు జైలుశిక్ష, రూ. లక్ష వరకు జరిమానా విధించేలా 'మత స్వేచ్ఛ బిల్లు 2020'ని రూపొందించింది మధ్యప్రదేశ్ ప్రభుత్వం. దీనికి ఆదివారం ఆ రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. డిసెంబర్ 28న ప్రారంభించాలనుకున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టాలని యోచించింది. అయితే సమావేశాలు వాయిదా పడటం వల్ల ఆర్డినెన్సు మార్గం ఎంచుకుంది.

ఈ చట్టం ప్రకారం మోసపూరితంగా జరిగిన వివాహాన్ని చెల్లనిదిగా పరిగణిస్తారు. మతాన్ని మార్చుకోవాలని అనుకునేవారు జిల్లా ప్రభుత్వ అధికారుల వద్ద దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఉత్తర్​ప్రదేశ్ ప్రభుత్వం సైతం ఈ తరహా ఆర్డినెన్సును తీసుకొచ్చింది. ఈ ఆర్డినెన్సు ఆధారంగా.. నెల రోజుల వ్యవధిలో 12 ఎఫ్​ఐఆర్​లు నమోదు కాగా.. 35 మంది అరెస్ట్ అయ్యారు.

ఇదీ చదవండి: 'ఆత్మనిర్భర్​ భారత్​కు సరకు రవాణా కీలకం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.