మధ్యప్రదేశ్లోని పన్నా టైగర్ రిజర్వులో ఓ ఆడపులి మరణించింది. పులికి పంచనామా నిర్వహించి.. నమూనాలను కరోనా పరీక్షలకు పంపించామని అధికారులు తెలిపారు. పీ-213(32) ఆడపులి ఎడమ కాలుకు కొంతకాలం క్రితం గాయమైందని.. దీంతో పులి నడవలేని స్థితికి వచ్చిందన్నారు. ఆడపులికి నాలుగు పిల్లలు ఉన్నాయని వివరించారు. ఆడపులికి టైగర్ రిజర్వులోనే అంత్యక్రియలు నిర్వహించినట్లు ఫీల్డ్ డైరెక్టర్ ఉత్తమ్ కుమార్ శర్మ తెలిపారు.


పులి మృతికి కారణాలు తెలియకపోవటం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు. ఇతర పులులను సంరక్షించేందుకు చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి : జమ్ముకశ్మీర్లో ఎన్కౌంటర్- ఇద్దరు తీవ్రవాదులు హతం