Man shoots sister in law: మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. తినే అన్నం సరిగా వండలేదని వదినను కాల్చి చంపాడు ఓ మరిది. అనంతరం తానూ తుపాకీ కాల్చుకున్నాడు. ఈ ఘటన దేవాస్ హాత్పిపాల్యాలో జరిగింది.
జిల్లా కేంద్రానికి 45 కిమీ దూరంలో ఉన్న హాత్పిపాల్యాలో రీనా మాల్వియా ఓ ఆసుపత్రిని నడుపుతుంది. ఆదివారం అయినా అన్న సరిగా వండలేనది ఆమెను తన వద్ద ఉన్న తుపాకీతో విజయ్ మాల్వియా కాల్చి చంపినట్లు ఎస్పీ సుర్యకాంత్ శర్మ తెలిపారు. ఆపై తాను కూడా పక్కన ఉన్న పెరటిలో అదే తుపాకీతో కాల్చుకుని చనిపోయినట్లు పేర్కొన్నారు.
ఇంతలో వచ్చిన ఆసుపత్రి సిబ్బంది వారిని పరీక్షించగా అప్పటికే చనిపోయినట్లు నిర్ధరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఘటన స్థలం నుంచి తుపాకీ, మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
ఈ ఘటనపై రీనా భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. అన్న సరిగా వండని కారణంగా వీరి మధ్య గొడవ జరిగిందని పేర్కొన్నారు. దీంతో కాల్పులు జరినట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి: 'సీఎం నా ఫోన్ ట్యాప్ చేసి వింటున్నారు!'