ETV Bharat / bharat

కలెక్టర్ ఎదుటే ఉమ్మిన వ్యక్తి.. ఆ తర్వాత..? - డిండోరీ కలెక్టర్ తాజా వార్తలు

ఆస్పత్రి ప్రాంగణంలో ఉమ్మిన వ్యక్తిపై ఓ కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వ్యక్తితోనే.. ఉమ్మిని తూడ్పించారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ ఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది.

Dindori Collector
కలెక్టర్
author img

By

Published : Sep 15, 2021, 5:55 PM IST

ఉమ్మిన వ్యక్తితోనే తూడ్పించిన కలెక్టర్

ఆస్పత్రిలో ఆవరణలో బహిరంగ ప్రదేశంలో ఉమ్మిన వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేశారు మధ్యప్రదేశ్​, డిండోరీ జిల్లా కలెక్టర్​. ఆ వ్యక్తితోనే ఉమ్మిని శుభ్రం చేయించారు.

ఏం జరిగిందంటే?

డిండోరీ జిల్లా కలెక్టర్​ రత్నాకర్​ ఝా.. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. తనిఖీ అనంతరం.. కలెక్టర్ బయటకు వస్తుండగా ఆస్పత్రి ప్రాంగణంలో ఓ వ్యక్తి గుట్కా తిని ఉమ్మేశాడు. ఈ దృశ్యాన్ని చూసిన కలెక్టర్ రత్నాకర్​..ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి ప్రశ్నించాడు. ఉమ్మిని తీయమని ఆదేశించాడు.

Dindori Collector
ఉమ్మిన వ్యక్తితోనే తూడ్పించిన కలెక్టర్

దీంతో ఆ వ్యక్తి తన చేతులతో ఉమ్మిని తుడిచాడు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయ్యాయి. ఈ వీడియో చూసిన కొంతమంది మద్దతిస్తుండగా.. మరికొంతమంది మాత్రం.. కలెక్టర్ చర్యలను తప్పుబట్టారు.

ఆ వ్యక్తి డిండోరీ జిల్లా, సర్హారీ గ్రామానికి చెందినవాడు. ఈ ఘటన తర్వాత వైద్య అధికారులు కూడా ఆ వ్యక్తికి నోటీసులు అందించారు. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

ఇదీ చదవండి: జైలులో ఆ పాట వినాలని ఖైదీ కోరిక.. చివరకు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.