దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరల పెంపుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ కార్యకర్తలు ఎల్పీజీ ధరల పెంపును నిరసిస్తూ.. గ్యాస్ సిలిండర్లను దెవాస్లోని మీతా తలాద్ సరస్సులో విసిరివేశారు. ధరలు త్వరితగతిన తగ్గించాలని డిమాండ్ చేశారు. తలపై కర్రలు మోసుకుంటూ వెళ్లారు. ఇకపై వంట.. కర్రలతోనే చేసుకోనున్నట్లు తెలిపారు.


"ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో ద్రవ్యోల్భణాన్ని అదుపు చేయలేకపోతున్నారు. ప్రధాని పదవి నుంచి ఆయన వైదొలగాలి. వంటగ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి."
--యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు.
ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రజలు మండిపడుతున్నారు. అయితే.. ఏడేళ్ల క్రితం 2014 మార్చి 1న రూ. 410.50 రూపాయలు ఉన్న సిలిండర్ ధర ప్రస్తుతం రూ. 834. 50కు పెరిగింది.

ఇదీ చదవండి:బంగాల్ మంత్రి 38 కిలోమీటర్ల సైకిల్ యాత్ర