ETV Bharat / bharat

ఘోర రోడ్డు ప్రమాదం- 13మంది దుర్మరణం - మధ్యప్రదేశ్​లో 10 మంది మృతి

10 passengers died in Gwalior road accident
ఘోర రోడ్డు ప్రమాదం- 13మంది దుర్మరణం
author img

By

Published : Mar 23, 2021, 7:15 AM IST

Updated : Mar 23, 2021, 10:31 AM IST

07:11 March 23

ఘోర రోడ్డు ప్రమాదం- 13మంది దుర్మరణం

10 passengers died in Gwalior road accident10 passengers died in Gwalior road accident
13 మంది దుర్మరణం

మధ్యప్రదేశ్​లో గ్వాలియర్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతిచెందారు. మృతుల్లో 12 మంది మహిళలు. ఓల్డ్ చావ్నీ ప్రాంతంలో బస్సు-ఆటో ఢీకొనడం వల్ల ఇంతటి విషాదం సంభవించిందని పోలీసులు తెలిపారు.  

మంగళవారం ఉదయం 7 గంటలకు.. అంగన్​ వాడీ కేంద్రాల్లో పనిచేసే మహిళలు విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని గ్వాలియర్ ఎస్పీ అమిత్ సింగ్ వెల్లడించారు.

ప్రమాదంలో 8 మంది మహిళలు, ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందగా.. మిగతా వారు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మరణించారు.  

ఈ ఘటనపై మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్ చౌహాన్​ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున ఎక్స్​గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి రూ. 50,000 ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.  

Last Updated : Mar 23, 2021, 10:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.