ETV Bharat / bharat

'తల్లి గర్భం, సమాధి మాత్రమే మహిళకు సురక్షితం'- బాలిక సూసైడ్​ నోట్​ - తమిళనాడు వార్తలు తాజా

Sexual Harassment: లైంగిక వేధింపులు ఎదుర్కొన్న ఓ మైనర్​ ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె రాసిన సూసైడ్​ నోట్​ కంటతడి పెట్టిస్తోంది. 'తల్లి గర్భం, సమాధి మాత్రమే మహిళకు సురక్షితమైన ప్రదేశాలు' అని రాసి ప్రాణాలు తీసుకుంది.

Sexual Harassment
మైనర్
author img

By

Published : Dec 20, 2021, 11:07 AM IST

Sexual Harassment: పసిపిల్లల నుంచి పండు ముసలివారి వరకు ఏ మహిళకు కూడా సమాజంలో రక్షణ లేకుండా పోయింది. అనువైన ప్రాంతంలో కంటికి ఎవరు చిక్కినా.. కామాంధులు వారిపై పంజా విసురుతున్నారు. దేశంలో అనేక చోట్ల ప్రతిరోజు అత్యాచార ఘటనలు, వేధింపులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. అలాంటి మానసిక వేధింపులకు గురైన ఓ బాలిక.. తన బాధను ఎవరికీ చెప్పుకోలేక నరకయాతన అనుభవించి చివరకు తనువు చాలించింది. ఆమె రాసిన సూసైడ్‌ నోట్‌ కంటతడి పెట్టిస్తోంది.

చెన్నైలోని పూనమల్లే ప్రాంతానికి చెందిన 11వ తరగతి విద్యార్థిని కొద్దిరోజుల క్రితం అదృశ్యమవగా.. తాజాగా పోలీసులు ఆమె మృతదేహాన్ని గుర్తించారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆమె ఇంట్లో ఓ సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా ఆ లేఖలో 'తల్లి గర్భం, సమాధి మాత్రమే మహిళకు సురక్షితమైన ప్రదేశాలు' అని రాసుకొచ్చింది. తన కుమార్తె 9వ తరగతి వరకు ఓ ప్రైవేటు పాఠశాలలో చదివిందని, ఆ స్కూల్‌లో పనిచేసే ఓ ఉపాధ్యాయుడి కుమారుడు తన కుమార్తెను వేధించేవాడని తల్లి పోలీసులకు తెలిపింది. ఆ వేధింపుల కారణంగానే ఇప్పుడు మరో పాఠశాలలో చేర్పించినట్లు వివరించింది. తల్లి ఫిర్యాదుతో పోలీసులు ఈ కోణంలోనూ దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చూడండి : గుజరాత్​లో డ్రగ్స్ కలకలం.. పాక్ పడవలో రూ.400 కోట్ల హెరాయిన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.