దేశ ప్రజలకు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. భాషా వైవిధ్యమే నాగరికతకు గొప్ప పునాది అని ఆయన అన్నారు. భాష అనేది కేవలం మన భావాలను ఎదుటివాళ్లకు తెలియజేసేందుకే కాకుండా.. మన సంప్రదాయాలను సామాజిక సంస్కృతిని చాటిచెప్పే గొప్ప వారిధి అని అభివర్ణించారు వెంకయ్య.
జీవితానికి అమ్మ భాష ఆత్మ వంటిదని అభిప్రాయపడ్డ వెంకయ్య.. మన మాతృభాషను మనం పరిరక్షించుకోవాలన్నారు. ప్రాథమిక విద్య మొదలుకొని పరిపాలన వరకూ అన్నింట్లో అమ్మ భాషకే ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు. మన సృజనాత్మక ఆలోచనలు, భావ వ్యక్తీకరణను తమ తమ మాతృభాషల్లో ప్రోత్సహించుకోవాలని ఆయన సూచించారు.
ఇదీ చదవండి: అమ్మభాషతోనే స్వావలంబన: వెంకయ్య