ETV Bharat / bharat

కన్నబిడ్డల తలలు నరికి చంపిన తల్లి.. జైలు నుంచి విడుదలై ప్రియురాలి హత్య - జైలు నుంచి విడుదలై ప్రియురాలి గొంతి కోసిన వ్యక్తి

కన్న తల్లే.. అభశుభం ఎరుగని చిన్నారులను కిరాతకంగా హత్య చేసింది. కత్తితో నరికి తలలను శరీరం నుంచి వేరు చేసింది. ఈ దారుణ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. మరోవైపు.. జైలు నుంచి విడుదలైన హంతకుడు ప్రియురాలిని గొంతుకోసి హత్య చేశాడు.

mother kills children
mother kills children
author img

By

Published : Apr 8, 2023, 9:49 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లో అమానుష ఘటన జరిగింది. కన్న తల్లి తన ఇద్దరు చిన్నారులను కత్తితో పొడిచి హత్య చేసింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేసరికి ఆ చిన్నారుల తల, మొండెం వేరుగా పడి ఉన్నాయి. ఈ దారుణం గాజీపుర్​ జిల్లాలోని మర్దా పోలీస్ స్టేషన్​లో పరిధిలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
హమీర్​పుర్​ బిజౌరా అనే గ్రామంలో అజిత్ యాదవ్, అతడి భార్య నీతూ యాదవ్​ నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు హార్దిక్ (10 నెలలు), హ్యాపీ (6ఏళ్లు), కుమార్తె పారీ(9ఏళ్లు) ఉన్నారు. అజిత్​ యాదవ్​ జమ్ములో ఆర్మీ జవాన్​గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే, శుక్రవారం రాత్రి నీతూ యాదవ్.. పిల్లలతో తన గదిలో నిద్రించడానికి వెళ్లింది. అదే రాత్రి పిల్లలపై కత్తితో కనికరం లేకుండా దాడి చేసింది. ముగ్గురిలో ఇద్దరి చిన్నారుల తలలు నరికేసింది. మూడో కుమార్తె పారీ ప్రాణాలతో బయట పడింది. కాగా, ఈ ఘటనతో ఆ గ్రామంలో సంచలనం రేపింది.

సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాజీపుర్​ ఎస్పీ ఓం వీర్​ సింగ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారించారు. హంతకురాలు నేరం అంగీకరించిందని ఎస్పీ తెలిపారు. నిందితురాలి మానసిక స్థితి సరిగా లేదని.. ఆమె 4-5 సంవత్సరాలుగా చికిత్స తీసుకుంటోందని పేర్కొన్నారు. నిందితురాలిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా, విషయం తెలిసిన వెంటనే నిందితురాలి భర్త, ఆర్మీ జవాన్ అజిత్​ యాదవ్​​ జమ్ము నుంచి గాజీపుర్​ వచ్చాడు.

జైలు నుంచి బయటకు వచ్చి హత్య..
దిల్లీలో దారుణం జరిగింది. జైలు నుంచి బయటకు వచ్చిన హంతకుడు మరో హత్య చేశాడు. కత్తితో ప్రియురాలి గొంతుకోసి పాశవికంగా చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగోల్​పురికి చెందిన దీపక్​కు ఓ గర్ల్​ఫ్రెండ్​ ఉంది. సదరు యువతి దీపక్​ను డబ్బులు అడిగింది. దీంతో నిందితుడు స్థానిక డాక్టర్​ కుమారుడిని కిడ్నాప్​ చేసి.. అతడి నుంచి రూ.20 లక్షలు డిమాండ్​ చేశాడు. డాక్టర్​ నిరాకరించడం వల్ల కిడ్నాప్​ చేసిన వ్యక్తిని చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని హరియాణాలో పడేశాడు. ఆ తర్వాత పోలీసులకు దొరికిపోయి.. జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. అయితే, 2020లో కొవిడ్​ కారణంగా జైలు నుంచి విడుదలయ్యాడు. తన గర్ల్​ ఫ్రెండ్​ వేరే వ్యక్తిని వివాహం చేసుకుందని తెలిసి.. ఆమెను హత్యచేశాడు.
దీంతో, పోలీసులు అతడిపై రూ.50 వేల రివార్డు ప్రకటించారు. అనంతరం మంగోల్​పురి ప్రాంతంలో ఇటీవల అతడిని అరెస్టు చేసి విచారించారు. విచారణలో నేరం అంగీకరించిన హంతకుడు.. అరెస్టు నుంచి తప్పించుకోవడానికి ఇన్ని రోజులు బిహార్​, ఒడిశా, బంగాల్​, ఆంధ్రప్రదేశ్​, ఉత్తర్​ప్రదేశ్​లో దాక్కున్నానని చెప్పాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.