ETV Bharat / bharat

ట్యాబ్లెట్ల డోస్ పెంచి కన్నబిడ్డ 'హత్య'- శవాన్ని డ్రమ్ములో దాచి కిడ్నాప్ డ్రామా! - బిడ్డ హత్య కేసులో తల్లి అరెస్టు

Mother kills son: ఓ తల్లి తన ఐదు నెలల కుమారుడి ప్రాణాలు పోయేందుకు కారణమైంది. అంతేగాకుండా.. ఆ శిశువు మృతదేహాన్ని నీళ్ల డ్రమ్ములో దాచి పెట్టింది. అయితే.. పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.

Mother kills son:
నీళ్ల డ్రమ్ములో పసికందు మృతదేహం
author img

By

Published : Dec 26, 2021, 7:42 PM IST

Mother kills son: తన బిడ్డకు చిన్న దెబ్బతగిలినా తల్లి హృదయం తల్లడిల్లుతుంది. బిడ్డకు ఏదైనా ఆపదొస్తే ప్రాణాలర్పించైనా కాపాడాలనుకుంటుంది. కానీ, మహారాష్ట్రలో అమ్మతనానికి మచ్చతెచ్చే ఘటన ఒకటి వెలుగు చూసింది. ఓ తల్లి తన ఐదు నెలల మగ శిశువు మృతికి కారణమైంది. ఈ కేసులో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.

ఏం జరిగిందంటే..?

ఠాణె జిల్లా కల్వాలోని మహాత్మ పూలే నగర్ ప్రాంతానికి చెందిన ఓ ​కుటుంబం.. శుక్రవారం మధ్యాహ్నం తమ ఐదు నెలల బాలుడ్ని ఎవరో కిడ్నాప్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు బృందాలుగా ఏర్పడి శిశువు కోసం గాలింపు మొదలుపెట్టారు. అయితే.. శిశువు మృతదేహం ఆ ఇంటికి సమీపంలో ఉన్న ఓ ప్లాస్టిక్ నీళ్ల డ్రమ్ములో శనివారం ఉదయం కనిపించింది.

Baby body in water drum: "సీసీటీవీలో నమోదైన దృశ్యాలను మేం పరిశీలించాం. బాలుడి బంధువులు సహా ఇరుగుపొరుగువారిని ప్రశ్నించాం. ఈ క్రమంలో ఆ బాలుడు తరచూ అనారోగ్యానికి గురయ్యేవాడని, ప్రతిసారీ తల్లే మందులు ఇచ్చేదన్న విషయం మాకు తెలిసింది. శుక్రవారం కూడా ఆమె అనుకోకుండా తన కుమారుడికి అధిక డోసులతో ఉన్న మందులు ఇచ్చింది. దాంతో మందులు వికటించి.. బాలుడు మృతి చెందాడు" అని ఏసీపీ వెంకట్ అందలే తెలిపారు.

కిడ్నాప్ కథ అల్లి...

"బాలుడు మరణించాక.. తన కుమారుడ్ని శుక్రవారం మధ్యాహ్నం ఎవరో కిడ్నాప్ చేశారని మహిళ కథ అల్లింది. శనివారం ఉదయం బాలుడి మృతదేహాన్ని ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు నీళ్ల డ్రమ్ములో దాచి పెట్టింది. మహిళ తాను చేసిన నేరాన్ని ఒప్పుకుంది" అని ఏసీపీ తెలిపారు.

మహిళను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఆమెపై ఐపీసీలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఇదీ చూడండి: యువ నటి ఆత్మహత్య.. డ్రగ్స్ కేసు భయంతో...

ఇదీ చూడండి: 14 ఏళ్ల బాలికపై గ్యాంగ్​ రేప్​- 9 మంది అరెస్ట్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.