ETV Bharat / bharat

ఆ పనికి అడ్డొస్తున్నాడని.. మూడేళ్ల చిన్నారిని హత్యచేసిన తల్లి - kerala crime news

Mother Killed Son: ఓ మహిళ.. తన మూడేళ్ల చిన్నారిని చంపేసింది. అసలు కారణం తెలిసి పోలీసులు షాక్​ అయ్యారు. కేరళ పాలక్కాడ్​లో ఈ దారుణ ఘటన జరిగింది.

Mother killed 3-year-old son to live with boyfriend, arrested

author img

By

Published : Apr 13, 2022, 3:13 PM IST

Mother Killed Son: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని.. తన మూడేళ్ల కుమారుడ్ని హత్య చేసింది ఓ మహిళ. మహ్మద్​ షామిర్​, ఆసియాల కుమారుడు మహ్మద్​ షాన్​.. మంగళవారం రోజు ఇంట్లో విగతజీవిగా కనిపించాడు. అనంతరం.. పోలీసులు ఆసియాను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు నిజం బయటపడింది. చంపింది తానేనని పోలీసుల ముందు అంగీకరించింది. కేరళ పాలక్కాడ్​లోని ఏలప్పుళిలో జరిగిందీ ఘటన.

అసలేమైంది? ఆసియా భర్త షామిర్​కు మాటలు సరిగా రావు. సంవత్సర కాలంగా భర్తకు దూరంగా ఉంటోంది. ఈ క్రమంలోనే ఆమె మరొకరితో సన్నిహితంగా ఉండటం ప్రారంభించింది. ఆసియాకు కుమారుడు ఉన్న విషయం అతనికి తెలియదు. కొంతకాలానికి నిజం తెలుసుకొని ఆమెతో మాట్లాడటం మానేశాడు. దీంతో 'ప్రేమించిన వ్యక్తి' ఎక్కడ తనకు దూరమవుతాడో అని భావించి తల్లే చిన్నారిని హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.

ఆసియా తొలుత పోలీసులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసింది. తన కుమారుడు ఉదయం నిద్రలేవలేదని, తర్వాత.. ఖర్జూరం తిని అపస్మారక స్థితిలోకి వెళ్లాడని ఏవేవో మాయమాటలు చెప్పింది. పోలీసులు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించగా.. చివరకు తానే హత్య చేసినట్లు ఒప్పుకుంది.

ఇవీ చూడండి: భార్యపై అనుమానం.. నాలుగేళ్ల పాటు బంధించి చిత్రహింసలు

పింఛను కోసం 56 ఏళ్ల న్యాయ పోరాటం.. ఎట్టకేలకు...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.