ముంబయి ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో.. ఇద్దరు విదేశీ మహిళలను అరెస్టు చేశారు కస్టమ్స్ అధికారులు. సుమారు 5 కేజీల హెరాయిన్‌ను.. అక్రమంగా దేశంలోకి తరలిస్తుండగా పట్టుకున్నారు. దీని విలువ రూ. 25 కోట్లపైమాటే. నిందితులు తల్లీకూతుళ్లు కావడం గమనార్హం.
ఇద్దరు మహిళలు.. ఖతార్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్‌లో దోహా మీదుగా జోహన్నెస్‌బర్గ్ నుంచి ఆదివారం ముంబయి చేరుకున్నారు. ఆ సమయంలోనే వారు తీసుకొస్తున్న ట్రాలీ బ్యాగుల్లో నిషేధిత పదార్థం దాగి ఉన్నట్లు గుర్తించారు అధికారులు. అయితే.. నిందితులు ఏ దేశానికి చెందినవారో తెలియరాలేదు.
ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు చికిత్స పొందాలనే నెపంతో.. భారత్‌కు వచ్చారని అధికారులు తెలిపారు.
అతని కోసం గాలింపు..
ఈ మత్తుపదార్థాలను ముంబయిలోని ఓ హోటల్లో ఒకరికి ఇవ్వాల్సి ఉందని, అందుకు ప్రతిఫలంగా తమకు భారీగా డబ్బు ముట్టనున్నట్లు విచారణలో ఒప్పుకున్నారు నిందితులు.
ఆ వ్యక్తి ఎవరో తెలుసుకునే పనిలో ఉన్నారు అధికారులు. వీరిని కోర్టులో హాజరుపరిచి.. 14 రోజుల రిమాండ్ కోరనున్నట్లు తెలిపారు.
ఇవీ చూడండి: 'విజయవాడ డ్రగ్స్ విలువ రూ.9 వేల కోట్లు కాదు.. 21వేల కోట్లు!'