ETV Bharat / bharat

'యూపీలో వందేళ్ల నాటి మసీదు కూల్చివేత' - యూపీ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు మసీదు కూల్చివేత

ఉత్తర్​ప్రదేశ్ బారాబంకి జిల్లాలోని వందేళ్లనాటి ఓ పురాతన మసీదును అధికారులు కూల్చివేశారని యూపీ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు ఆరోపించింది. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండానే ఈ చర్య చేపట్టిందని పేర్కొంది. అయితే, మసీదు అక్రమ నిర్మాణమని, కోర్టు ఆదేశాల ప్రకారమే కూల్చేశామని అధికారులు స్పష్టం చేశారు.

Mosque demolished in UP's Barabanki
'యూపీలో వందేళ్ల నాటి మసీదు కూల్చివేత'
author img

By

Published : May 19, 2021, 12:13 PM IST

వందేళ్ల నాటి మసీదును ఉత్తర్​ప్రదేశ్ బారాబంకి జిల్లా యంత్రాంగం కూల్చేసిందని ఆల్​ ఇండియా ముస్లిం లా బోర్డు, యూపీ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు ఆరోపించాయి. దీనిపై న్యాయ విచారణకు డిమాండ్ చేశాయి.

"రామ్ సనేహీ ఘాట్ తహసీల్​లో వందేళ్ల పురాతనమైన గరీబ్ నవాజ్ మసీదును జిల్లా యంత్రాంగం కూల్చేసింది. ఎలాంటి చట్టపరమైన కారణాలు లేకుండానే పోలీసుల సమక్షంలో మంగళవారం కూల్చేసింది. మసీదు విషయంలో ఎలాంటి వివాదాలు లేవు. ఇది సున్నీ వక్ఫ్ బోర్డ్ పేరుతో నమోదై ఉంది. మసీదుకు సంబంధించిన పత్రాలను చూపించాలని రామ్ సనేహీ ఘాట్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ గత మార్చిలో అడిగారు. దీనిపై సంబంధిత కమిటీ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించింది."

-మౌలానా ఖాలిద్ సైఫుల్లా రెహ్మానీ, ఆల్ ఇండియా ముస్లిం లా బోర్డు తాత్కాలిక ప్రధాన కార్యదర్శి

ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే మసీదును కూల్చేశారని ఆరోపించారు మౌలానా ఖాలిద్. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో దీనిపై న్యాయ విచారణ జరిపించాలన్నారు. మసీదు శిథిలాలను ఆ ప్రాంతం నుంచి తొలగించే ప్రక్రియను ఆపేయాలని కోరారు. ఆ ప్రాంతంలో మరే ఇతర నిర్మాణం చేపట్టకూడదని డిమాండ్ చేశారు. 'ఆ ప్రదేశంలో మసీదును నిర్మించి ముస్లింలకు అందించే బాధ్యత ప్రభుత్వంపై ఉంది' అని అన్నారు.

అక్రమ నిర్మాణం: అధికారులు

అయితే, మసీదు నిర్మాణం అక్రమమని జిల్లా మేజిస్ట్రేట్ ఆదర్శ్ సింగ్ తెలిపారు. దీనికి సంబంధించి మార్చి 15వ తేదీనే సంబంధిత వ్యక్తులకు నోటీసులు పంపించామని చెప్పారు. 'నోటీసుల ద్వారా.. యాజమాన్య హక్కులపై వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేసే అవకాశం ఇచ్చాం. కానీ అక్కడ నివసించే వారు నోటీసు అందగానే పారిపోయారు' అని తెలిపారు.

మార్చి 18న తహసీల్ యంత్రాంగం మసీదును తమ పరిధిలోకి తీసుకున్నారని మేజిస్ట్రేట్ ఆదర్శ్ సింగ్ వివరించారు. మసీదు విషయంలో దాఖలైన కేసులను అలహాబాద్ హైకోర్టుకు చెందిన లఖ్​నవూ బెంచ్ ఏప్రిల్ 2న కొట్టేసిందని, తద్వారా నిర్మాణం అక్రమమని స్పష్టమైందని అన్నారు. అనంతరం.. రామ్ సనేహిలోని సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ కోర్టులో ఓ కేసు నమోదైందని తెలిపారు. ఆ న్యాయస్థానం ఆదేశాలను పాటించే కూల్చివేత నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. జాయింట్ మేజిస్ట్రేట్ దివ్యాంశు పటేల్ సైతం ఈ నిర్మాణాన్ని అక్రమంగా పేర్కొన్నారు.

ఇదీ చదవండి: వాయుగుండంగా మారిన తౌక్టే- ఆ రాష్ట్రాల్లో వర్షాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.