ETV Bharat / bharat

పెళ్లి భోజనం తిని 100 మందికి అస్వస్థత

ఒడిశాలో పెళ్లి భోజనం తిని దాదాపు 100 మంది ఆసుపత్రి పాలయ్యారు. వీరు తిన్న ఆహారం కల్తీ అయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

author img

By

Published : Feb 21, 2021, 7:49 PM IST

Updated : Feb 21, 2021, 10:48 PM IST

more-than-70-people-fall-sick-after-having-food-at-wedding-feast
పెళ్లి విందు తిని 70 మందికి ఆస్వస్థత

ఒడిశాలోని కేంద్రపార జిల్లాలో జరిగిన ఓ వివాహ శుభకార్యంలో కలుషిత ఆహారం తీసుకుని దాదాపు 100 మంది అస్వస్థతకు గురయ్యారు. మాటియా గ్రామానికి చెందిన పెళ్లి కొడుకు బంధువులు వివాహం నిమిత్తం పెళ్లికూతురు గ్రామం నిమ్‌పూర్‌కు వెళ్లారు. ఈ ఉదయం పెళ్లి తర్వాత ఏర్పాటు చేసిన విందు భోజనం ఆరగించిన బంధువులంతా ఒక్కసారిగా అనారోగ్యానికి లోనయ్యారు. వాంతులు, విరేచనాలతో ఇబ్బందులు పడ్డారు. వెంటనే అప్రమత్తమైన గ్రామస్థులు వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

బాధితులు తీసుకున్న ఆహారాన్ని పరీక్షించిన వైద్యులు ఆ ఆహారం కలుషితం అయినట్లు తేల్చారు. చికిత్స తీసుకుంటన్న బాధితుల్లో ముగ్గురి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో కటక్‌ ఆస్పత్రికి తరలించినట్లు వైద్యులు తెలిపారు.

ఇదీ చూడండి: 40 ఏళ్లలో తొలిసారి ప్రసంగించనున్న ఉల్ఫా నాయకుడు

Last Updated : Feb 21, 2021, 10:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.