ETV Bharat / bharat

Sachin Pilot: రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో మళ్లీ అసమ్మతి! - అశోక్​ గహ్లోత్​ వర్సెస్​ సచిన్ పైలెట్​

రాజస్థాన్ కాంగ్రెస్​లో రాజకీయ రగడ మళ్లీ తెరపైకి వచ్చింది. సీఎం అశోక్‌ గహ్లోత్‌ను విభేదిస్తున్న యువ నాయకుడు సచిన్​ పైలెట్​కు పలువురు నేతలు బహిరంగంగానే మద్దతునిస్తుండటం.. పార్టీలో అసమ్మతి రాజుకున్నట్టు కనిపిస్తోంది.

Pilot loyalists come out in open
బహిరంగంగానే సచిన్​ పైలెట్​కు ​ మద్దతుదారుల ప్రకటన
author img

By

Published : Jun 12, 2021, 7:35 AM IST

Updated : Jun 12, 2021, 7:56 AM IST

రాజస్థాన్‌ కాంగ్రెస్‌ పార్టీలో మళ్లీ అసమ్మతి రాజుకుంటోంది. సీఎం అశోక్‌ గహ్లోత్‌తో విభేదిస్తున్న యువ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌(Sachin Pilot)కు పలువురు నాయకులు బహిరంగంగానే మద్దతు ఇస్తున్నారు. శుక్రవారం స్వగ్రామైన దౌసా జిల్లా భండానాలో తన తండ్రి రాజేశ్‌ పైలట్‌ వర్ధంతి కార్యక్రమంలో సచిన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హాజరైన పలువురు నేతలు ఆయనకు అండగా ఉంటున్నట్టు చెప్పారు.

తోడభీం ఎమ్మెల్యే పి.ఆర్‌.మీనా మాట్లాడుతూ సచిన్‌ లేవనెత్తిన సమస్యలను పార్టీ అధిష్ఠానం పరిష్కరించాల్సి ఉందన్నారు. మరో సీనియర్‌ ఎమ్మెల్యే హేం రాం చౌధరి కూడా ఉదయం జైపుర్‌లో సచిన్‌ను కలిశారు. ఆయనకు మద్దతుగా ఎమ్మెల్యే పదవిని వదులుకుంటున్నట్టు గతంలోనే ప్రకటించారు. మాజీ మంత్రి విశ్వేంద్ర సింగ్‌, సీనియర్‌ నాయకులు వేద్‌ ప్రకాశ్‌ సోలంకి, ముకేశ్‌ భట్కర్‌, రాంనివాస్‌ గ్వారియా, రాకేశ్‌ పరీక్‌ కూడా ఆయనను కలిశారు. వారంతా మంత్రివర్గ విస్తరణలో జరుగుతున్న జాప్యంపైనే ప్రశ్నించారు. సచిన్‌ భాజపాలో చేరుతారన్న ఊహాగానాలు వ్యాపించాయి. వీటిని ఆయన ఖండించారు.

ఇవీ చదవండి:టీఎంసీలో చేరికపై ప్రణబ్​ కుమారుడి క్లారిటీ

Sachin Pilot: ఆమె ఆ సచిన్‌తో మాట్లాడారేమో!

Last Updated : Jun 12, 2021, 7:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.