Monsoon Session Of Parliament 2023 : పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జులై 20న ప్రారంభమై ఆగస్టు 11 వరకు జరగనున్నాయి. ఈ మేరకు పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి శనివారం ప్రకటించారు. ఈ సమావేశాల్లో శాసనసభ వ్యవహారాలు, ఇతర అంశాలపై ఫలప్రదమైన చర్చలకు సహకరించాలని అన్ని పార్టీలను కోరారు.
Uniform Civil Code In India : కొంతకాలంగా ఉమ్మడి పౌర స్మృతి-యూసీసీపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దీనికి తోడు యూసీసీపై ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ తరుణంలో జరుగుతున్న వర్షాకాల పార్లమెంటు సమావేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. యూసీసీపై ముందడుగు వేసేలా కేంద్ర ప్రభుత్వం ఈ సమావేశాల్లో ఏమైనా చర్యలు తీసుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది.
Opposition Front : 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మోదీ నేతృత్వంలోని బీజేపీకి వ్యతిరేకంగా ఫ్రంట్‌ను ఏర్పాటు చేస్తున్నాయి ప్రతిపక్షాలు. ఈ సమయంలో జరుగుతున్న సమావేశాల్లో.. ప్రభుత్వ, ప్రతిపక్షాల మధ్య వాడీవేడిగా చర్చలు జరిగే అవకాశం ఉంది.
Delhi Ordinance Bill : 17 సిట్టింగ్‌ల్లో 27 రోజుల పాటు సాగనున్న ఈ సమావేశాలు.. పాత పార్లమెంటు భవనంలో ప్రారంభమై.. తర్వాత కొత్త భవంతిలోకి మారే అవకాశం ఉందని సమాచారం. ఈ సమావేశాలలో.. దిల్లీ ప్రభుత్వ అధికారుల బదిలీలు, నియామకాల విషయంలో లెఫ్టినెంట్ గవర్నర్‌ను తుది మధ్యవర్తిగా చేస్తూ తీసుకువచ్చిన.. 'దిల్లీ గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ (సవరణ) ఆర్డినెన్స్' స్థానంలో బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీంతో పాటు కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన రీసెర్చ్ ఫౌండేషన్ బిల్లును కూడా పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. శాస్త్ర సాంకేతిక రంగాలలో దేశ పరిశోధన సామర్థ్యాన్ని పెంపొందించడానికి.. ఈ ఫౌండేషన్ నిధుల ఏజెన్సీగా ఉండనుంది.
Uniform Civil code News : ప్రధాని మోదీ వ్యాఖ్యల తర్వాత ఉమ్మడి పౌరస్మృతిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ చర్చ రాజకీయ వర్గాల్లో దుమారం రేపింది. అయితే, ఈ యూసీసీకి కొన్ని విపక్ష పార్టీలు అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే.. యూసీసీకి మద్దతు ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సూత్రప్రాయంగా మద్దతు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇంతకుముందు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది.
Uniform Civil Code UPSC : ఉమ్మడి పౌరస్మృతి అనేది దేశంలోని పౌరులందరికీ ఒకే చట్టం ఉండాలని చెబుతుంది. మతపరమైన ఆచారాలు, సంప్రదాయాలకు అతీతంగా వ్యక్తిగత అంశాలపై చట్టాలు అమలు చేయాలని సూచిస్తుంది. వివాహాల నుంచి విడాకుల వరకు.. భరణం నుంచి వారసత్వం వరకు వ్యక్తిగత చట్టాల స్థానంలో ఉమ్మడి పౌరస్మృతి ఏర్పాటు చేయాలని చెబుతుంది. పూర్తి వివరణ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.