ETV Bharat / bharat

'ప్రభుత్వ పథకాల్లో అవినీతి'.. మోదీకి లేఖ రాసి చేయి కోసుకున్న సాధువు - పూజారిపై దాడి చేసిన ముగ్గురు వ్యక్తులు

ప్రభుత్వ పథకాల్లో అవినీతిని జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తూ ఓ సాధువు తన చేయిని కోసుకున్నాడు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. మరోవైపు, పూజారి సరిగ్గా పూజలు చేయలేదని అతడిని చితకబాదారు ముగ్గురు వ్యక్తులు. ఈ దారుణం మధ్యప్రదేశ్​లో జరిగింది.

monk cut his hand
చేతిని కోసుకున్న సాధువు
author img

By

Published : Oct 3, 2022, 7:37 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ అయోధ్యలో దారుణం జరిగింది. సరయూ ఘాట్​లో ఓ సాధువు తన చేతిని పదునైన ఆయుధంతో కోసుకున్నాడు. సాధువును ఆస్పత్రికి తరలించగా.. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సోమవారం ఉదయం జరిగిందీ ఘటన. సాధువును విమల్​ కుమార్​గా గుర్తించారు పోలీసులు. ఆయన స్వస్థలం బిహార్​లోని ఆరారియా.

చేయి కోసుకున్న సాధువు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాధువు జేబులో ఓ లెటర్ ఉంది. అందులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరు ఉంది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ఉపాధి హామీ పథకం సహా పలు పథకాల్లో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని ఆ లేఖలో ఉంది. అవినీతిపరులపై చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొన్నారు. సాధువు బందువులకు పోలీసులు సమాచారం అందించారు. ప్రభుత్వ పథకాల్లో అవినీతి జరగడం వల్లే విమల్ కుమార్.. అసంతృత్తికి లోనై చేతిని కోసుకున్నాడని పోలీసులు తెలిపారు. బాధితుడి మానసిక ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేదా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

పూజారిపై దాడి..
మరోవైపు, మధ్యప్రదేశ్ ఇందోర్​లో దారుణం జరిగింది. సత్యనారాయణ పూజ సరిగ్గా చేయలేదని ఓ పూజారిపై దాడికి పాల్పడ్డారు ముగ్గురు వ్యక్తులు. సోమవారం జరిగిందీ ఘటన. బాధితుడిని కుంజ్​బిహారి శర్మగా పోలీసులు గుర్తించారు. ఆయన స్వస్థలం రాజస్థాన్​. నిందితులను లక్ష్మీకాంత శర్మ, అతని కుమారులు విపుల్​, అరుణ్​గా పోలీసులు గుర్తించారు. విపుల్ ఏకంగా.. కుంజ్​బిహారి చెవిపై కొరికేశాడు. బాధితుడ్ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ముగ్గురు నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు.

ఇవీ చదవండి: అమ్మో.. ఎంత పెద్ద పన్ను.. ప్రపంచంలోనే పొడవైనది ఇదే..

గర్బా డ్యాన్స్ చేస్తూ యువకుడు మృతి.. మరణాన్ని తట్టుకోలేక తండ్రి సైతం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.