20 ఏళ్ల యువతిని అపహరించి, సామూహిక అత్యాచారానికి(Gang Rape) పాల్పడ్డారు ఐదుగురు దుండగులు. నిందితుల్లో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దుర్ఘటన బిహార్‌లోని ఔరంగాబాద్‌లో జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం.. జిల్లాలోని మదన్‌పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువతి(gang rape victim ).. ఇంటి దగ్గర్లోని స్నేహితులను కలిసేందుకు వెళుతుండగా ఐదుగురు యువకులు అడ్డగించి మత్తు మందు చల్లారు. అపస్మారక స్థితిలోకి వెళ్లగానే అపహరించి.. తమ గదికి తీసుకెళ్లి ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు.
ఆ తర్వాత హత్య చేసే ఆలోచనతో కారులో ఎక్కించుకుని తీసుకెళుతుండగా.. అటుగా వచ్చిన ముఫాస్సీల్ ఠాణాకు చెందిన రాత్రి పెట్రోలింగ్ సిబ్బంది ఆపారు. వాహనంలో ముగ్గురు యువకులు, అపస్మారక స్థితిలో యువతి ఉండటాన్ని గమనించి వారిని అదుపులోకి తీసుకున్నారు.
అయితే.. ముందుగా ఇది ప్రేమ వ్యవహారానికి సంబంధించిందని, నిందితులు రాహుల్ కుమార్, బిట్టు పాసవాన్‌తో పాటు మరో ఇద్దరు ఆ యువతిని మతాంతర వివాహం చేసుకునేందుకు తీసుకెళ్లారని ప్రాథమింగా అంచనాకు వచ్చామని పోలీసులు తెలిపారు. కానీ, యువతి తేరుకున్నాక తనపై అత్యాచారం జరిగిందని వాంగ్మూలం ఇచ్చిందని, నిందితుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ కంతేశ్ కుమార్ చెప్పారు. వైద్య పరీక్షల కోసం బాధితురాలిని సదర్ ఆసుపత్రికి తరలించామన్నారు.
దుండగులను కఠినంగా శిక్షించాలి..
ఎంపీ సుశీల్ కుమార్ సింగ్‌ను కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు బాధితురాలి కుటుంబ సభ్యులు. ఎస్పీ కంతేశ్ కుమార్ మిశ్రాతో ఫోన్లో మాట్లాడిన ఎంపీ.. న్యాయం చేస్తామని భరోసా కల్పించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా దుండగులకు త్వరగా శిక్ష పడేలా చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: 11 ఏళ్ల విద్యార్థినిపై స్కూల్ ప్రిన్సిపల్ అత్యాచారం