ETV Bharat / bharat

బాలికపై గ్యాంగ్​రేప్.. అడవిలోకి తీసుకెళ్లి దారుణం.. ఒకే ఇంట్లో ముగ్గురు ఆత్మహత్య

జాతరకు వెళ్లి తిరిగి వస్తున్న ఓ బాలికను అపహరించి అత్యాచారానికి పాల్పడ్డారు నలుగురు కిరాతకులు. ఈ ఘటన బిహార్​లో జరిగింది. మరోవైపు, ఉత్తర్​ప్రదేశ్​లోని లలిత్​పుర్​లో ఓ మైనర్​పై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు.

gang rape in bihar
minor rape in muzzaffarpur
author img

By

Published : Oct 4, 2022, 7:32 PM IST

Gang Rape In Bihar : బిహార్​లోని ముజఫర్​పుర్​కు చెందిన 12 ఏళ్ల బాలికపై నలుగురు కిరాతకులు అత్యాచారానికి పాల్పడ్డారు. స్నేహితులతో కలిసి జాతరకు వెళ్లిన బాలిక.. తిరిగివస్తున్న సమయంలో అడవిలోకి తీసుకెళ్లి సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఔరాయి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్వాప్తు ప్రారంభించారు.

అసలేం జరిగిందంటే:
ఓ బాలిక తన స్నేహితులతో కలిసి జాతర చూసేందుకు వెళ్లింది. తిరిగి వస్తున్న సమయంలో దారిలో రెండు బైకుల్లో వచ్చిన నలుగురు వ్యక్తులు ఆమెను అడవిలోకి ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లాక ఆమెను అక్కడ వదిలేసి పరారయ్యారు. బాలికతో పాటు వచ్చిన స్నేహితులు పరిగెత్తుతూ ఇంటికి చేరుకున్నారు. విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు తెలియజేయగా.. వారు గ్రామస్థులతో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. అడవిలో వెతకగా బాలిక అపస్మారక స్థితిలో కనిపించింది. బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు.

ఉత్తర్​ ప్రదేశ్​లోనూ ఇదే తరహా కేసు..
ఉత్తర్​ప్రదేశ్​లోని లలిత్​పుర్​లో ఓ మైనర్​పై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బాలిక తల్లి న్యాయం కోసం పోలీస్​ స్టేషన్​ను ఆశ్రయించారు. కానీ పోలీసులు ఈ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సెప్టంబర్​ 30న సాయంత్రం బాలిక పొలం పనుల కోసం వెళ్లింది. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు చిన్నారిని ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఆస్పత్రిలో బాలిక చికిత్స పొందుతునప్పటికీ.. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే ఈ అత్యాచారానికి వెనుక బాలికకు సమీప బంధువైన ఓ మహిళ హస్తముందని తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు.

ఒకే ఇంట్లో ముగ్గురు మృతి
కూతురు తమ మాటకు వ్యతిరేకంగా మరొకరితో వివాహానికి సిద్ధమయ్యిందని.. అవమానం తట్టుకోలేక ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. యువతి తల్లి, తండ్రితో పాటు ఆమె సోదరుడు సైతం మృతి చెందిన ఘటన కర్ణాటకలోని చిక్కబళ్లాపురలో జరిగింది.

హం​దిగనలా గ్రామానికి చెందిన అర్చన అనే యువతి నారయణస్వామి అనే యువకుడు ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ వ్యవహారం పెద్దలకు తెలిసింది. వేర్వేరు కులాలకు చెందిన వ్యక్తులవ్వడం వల్ల వీరి ప్రేమను నిరాకరించారు అర్చన కుటంబసభ్యులు. అయితే అర్చన తన ప్రియుడితో కలిసి ఇంట్లో నుంచి పారిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన కుటుంబసభ్యులు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

ఈ ఆత్మహత్యలకు కారణం తన కూతురే అని ఆమెకు తన ఆస్తిలోని వాట దక్కకూడదని మృతి చెందిన శ్రీ రామప్ప సూసైడ్​ నోట్​లో పేర్కొన్నారు. పెద్దకుమారుడు రంజిత్​ నిద్రిస్తున్న సమయంలో మిగతా ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. అంతే కాకుండా చిన్న కుమారుడు మనోజ్​ చనిపోకముందు తన చెల్లికి ఓ మెసేజ్​ పంపినట్లు పోలీసుల విచారణలో తేలింది.

గొర్రెలను ఎత్తుకెళ్లారని...
గొర్రెలను అపహరించారన్న అనుమానంతో ఇద్దరు యువకులను పట్టుకుని చితకబాదారు ఓ గ్రామ ప్రజలు. ఇందులో ఒకరు ప్రాణాలతో తప్పించుకోగా మరొకరు గ్రామస్థుల దెబ్బలకు తట్టుకోలేక అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన ఛత్తీస్​గఢ్​లో జరిగింది.

పోలీసుల వివరాల ప్రకారం.. ఝార్ఖండ్​లోని తిగరా గ్రామస్థులు తమ గ్రామంలోని గొర్రెలను దొంగలిస్తున్నారని ఛత్తీస్​గఢ్​లోని పేకు గ్రామ వాసులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఆగ్రహించిన ఊరి జనం దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. సోమవారం ఇద్దరు యువకులు గొర్రెలను ఎత్తుకెళ్లేందుకు వచ్చారు. వచ్చిన వారిద్దరూ నీమ్​గామ్​ వద్ద గ్రామస్థుల కంట్లో పడ్డారు. వెంటనే వారిని పట్టుకునేందుకు జనం పరుగులు తీశారు. పేకు సమీపంలోని ఓ నది వద్ద ఇద్దరు యువకులను పట్టుకున్నారు. ఆగ్రహంతో గ్రామస్థులు వారిద్దరిని చితకబాదారు. దెబ్బలకు తట్టుకోలేక ఎజాజ్​అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని తదుపరి విచారణ చేపడుతున్నారు. వీరిద్దరూ తిగారా గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతి చెందిన యువకుడు ఇదివరకే ఓ చోరి కేసుతో పాటు అనేక ఆరోపణలతో కటకటాలపాలయ్యాడని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.