ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ గొప్ప నాయకుడు అని కొనియాడారు భాజపా నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమా భారతి. గంగానది, హిమాలయాలను మోదీ కాపాడతారని అన్నారు. బిహార్, ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రాల్లోని గంగానదిలో మృతదేహాలు తేలుతున్న నేపథ్యంలో ఉమాభారతి వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది.
"2014 జూన్ నుంచి 2016 జులై వరకు నా శరీరంలో ప్రవహించింది రక్తం కాదు.. గంగా నది. ఆ రోజుల్లో గంగానే నా సర్వస్వం. 2016 జులై-అక్టోబర్ మధ్యకాలంలో గంగా అభివృద్ధి పనులు చేపట్టాం. ఆ నదికి సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కరించే మార్గం కనుగొన్నాం. యమునా, సరస్వతి ఇతర నదులను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు వేశాం. ప్రధాని మోదీపై మాకు పూర్తి నమ్మకం ఉంది. ఆయన అతీంద్రియ నేత. గంగా నదితో పాటు హిమాలయాలనూ కాపాడతారు."
-ఉమా భారతి, భాజపా నేత
కేబినెట్లో కొనసాగాలని ప్రధాని మోదీ, అమిత్ షా తనను కోరారని ఉమా భారతి పేర్కొన్నారు. కానీ గంగా నది సమీపంలోని సాధువులను కలిసేందుకు ప్రస్తుతం సమయం వెచ్చిస్తున్నట్లు తెలిపారు. 2024 ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:జులైలో సీబీఎస్‌ఈ 'పది' ఫలితాలు