ETV Bharat / bharat

చెన్నై వరద బాధితుల పరిస్థితి తీవ్రంగా కలచివేసింది : మోదీ - తమిళనాడు వార్తలు

Modi Tamil Nadu Visit Today : చెన్నై వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించారు ప్రధాని నరేంద్ర మోదీ. వరదల్లో సర్వం కోల్పోయిన కుటుంబాల పరిస్థితి తనను తీవ్రంగా కలిచివేసిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యమైనంత సాయం అందిస్తున్నట్లు మోదీ వివరించారు.

modi tamil nadu visit today
modi tamil nadu visit today
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 2, 2024, 2:08 PM IST

Updated : Jan 2, 2024, 2:28 PM IST

Modi Tamil Nadu Visit Today : తమిళనాడులో ఇటీవలే సంభవించిన వరదల్లో సర్వం కోల్పోయిన కుటుంబాల పరిస్థితి తనను తీవ్రంగా కలచివేసిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. సంక్షోభ సమయంలో తమిళనాడు ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పారు. తాము రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యమైనంత సహాయం చేస్తున్నామని వెల్లడించారు.

  • #WATCH | Tiruchirappalli, Tamil Nadu: PM Narendra Modi says, "The last few weeks of 2023 were difficult for many people in Tamil Nadu. We lost many of our fellow citizens due to heavy rainfall. There has also been a significant loss of property... The central government stands… pic.twitter.com/JdyyBOk4j4

    — ANI (@ANI) January 2, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"2004-2014 వరకు అప్పటి ప్రభుత్వం రాష్ట్రాలకు రూ.30 లక్షల కోట్లు ఇచ్చింది. గత పదేళ్లలో మా ప్రభుత్వం రూ.120 లక్షల కోట్లు ఇచ్చింది. 2004-2014 మధ్య తమిళనాడుకు వచ్చిన నిధులు కన్నా మేం 2.5రెట్లు ఎక్కువగా ఇచ్చాం. గత ఏడాదిలో 40మంది కేంద్రమంత్రులు రాష్ట్రంలో 400సార్లు పర్యటించారు. తమిళనాడు ఎంత వేగంగా అభివృద్ధి చెందితే దేశం కూడా అంతే వేగంగా అభివృద్ధి చెందుతుంది. మేక్ ఇన్ ఇండియాకు తమిళనాడు పెద్ద బ్రాండ్ అంబాసిడర్‌గా అవతరిస్తోంది."

-- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

తీర ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు, మత్స్యకారుల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి చాలా కృషి చేశామని ప్రధాని మోదీ తెలిపారు. తొలిసారిగా ప్రత్యేక మత్స్యశాఖను ఏర్పాటు చేసి ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించామని చెప్పారు. "తమిళ సంస్కృతీసంప్రదాయాలను చూసి భారతదేశం గర్విస్తోంది. నాకు చాలా మంది తమిళ స్నేహితులు ఉన్నారు. వారి దగ్గర తమిళ సంస్కృతి గురించి తెలుసుకున్నాను. నేను ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా తమిళనాడు గురించి మాట్లాడకుండా ఉండలేను. కొత్త పార్లమెంట్​ భవనంలో పవిత్ర సెంగోల్​ను ఏర్పాటు చేశాం. ఇది దేశానికి తమిళ వారసత్వం అందించిన సుపరిపాలన నమూనా" అని ప్రధాని మోదీ తెలిపారు.

  • #WATCH | Tiruchirappalli, Tamil Nadu: PM Narendra Modi says, "In the last one year, more than 40 central government ministers have visited Tamil Nadu more than 400 times. When Tamil Nadu will progress rapidly, the country will also progress rapidly..." pic.twitter.com/AYYpgZD4Li

విజయ్​కాంత్​కు మోదీ నివాళులు
రెండు రోజుల క్రితం అనారోగ్యంతో కన్నుమూసిన డీఎండీకే అధినేత, కోలీవుడ్ సీనియర్ నటుడు విజయ్ కాంత్​ను మోదీ తలుచుకున్నారు. ఆయన ఎప్పుడూ దేశప్రయోజనాలకు అన్నింటి కన్నా ఎక్కువ గౌరవం ఇచ్చారని ప్రశంసించారు. సినీ, రాజకీయ రంగాల్లో ఆయన ఓ 'కెప్టెన్' అంటూ మోదీ కొనియాడారు. ఈ సందర్భంగా విజయ్​కాంత్​కు నివాళులు అర్పించి, ఆయన కుటుంబానికి మోదీ సానుభూతి తెలిపారు.

  • #WATCH | Tiruchirappalli, Tamil Nadu: PM Narendra Modi says, "Rs 30 lakh crore was given to states from 2004-2014, but our government has given Rs 120 lakh crore in the last 10 years. We have given Tamil Nadu 2.5 times more amount than that was given from 2004-2014..." pic.twitter.com/vFFNEVkbr7

రాష్ట్రంలో రూ.20,140 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు మోదీ. అంతకుముందు రాష్ట్ర సీఎం స్టాలిన్​తో కలిసి తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలోని నూతన టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. పోర్టులు, రైల్వే, జాతీయ రహదారులు, పెట్రోలియం, సహజవాయువు, అణు ఇంధన, ఉన్నతవిద్యకు సంబంధించిన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు.

'ప్రజల్లో 'వికసిత్‌ భారత్‌' స్ఫూర్తి- నాటునాటుకు ఆస్కార్​తో దేశమంతా ఫుల్ ఖుషీ'

'మూడోసారి ప్రధానిగా మోదీ ఖాయం! రామమందిర అంశమే ప్రధాన ఎన్నికల టాపిక్'

Last Updated : Jan 2, 2024, 2:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.