ETV Bharat / bharat

Modi Saudi Prince Bilateral Talks : 'రెండు దేశాల భాగస్వామ్యం.. ప్రపంచానికి ఎంతో కీలకం'.. సౌదీ యువరాజుతో మోదీ భేటీ - మోదీ సౌదీ యువరాజు లేటెస్ట్​ న్యూస్​

Modi Saudi Prince Bilateral Talks : భారత్‌కు అత్యంత వ్యూహాత్మక భాగస్వాముల్లో సౌదీ అరేబియా ఒకటని ప్రధాని మోదీ తెలిపారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం.. పశ్చిమాసియాతోపాటు ప్రపంచ స్థిరత్వానికి ఎంతో కీలకమని చెప్పారు. మరోవైపు, భారత్​లో పర్యటించడం ఎంతో సంతోషంగా ఉందని సౌదీ యువరాజు మహ్మద్​ బిన్​ సల్మాన్​ పేర్కొన్నారు.

Modi Saudi Prince Bilateral Talks
Modi Saudi Prince Bilateral Talks
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 11, 2023, 3:30 PM IST

Modi Saudi Prince Bilateral Talks : భారత్, సౌదీ అరేబియా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం.. పశ్చిమాసియాతోపాటు ప్రపంచ స్థిరత్వానికి ఎంతో కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇరుదేశాలు కొత్త అంశాలతో తమ సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటున్నాయని చెప్పారు. భారత్‌కు అత్యంత వ్యూహాత్మక భాగస్వాముల్లో సౌదీ అరేబియా ఒకటని అన్నారు. ఆ దేశ యువరాజు, ప్రధాని మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌తో భేటీ సందర్భంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

  • #WATCH | Crown Prince and Prime Minister of the Kingdom of Saudi Arabia Prince Mohammed bin Salman bin Abdulaziz Al Saud met Prime Minister Narendra Modi at Hyderabad House in Delhi. pic.twitter.com/QEiLHbIgQY

    — ANI (@ANI) September 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'యావత్‌ ప్రపంచం ఎంతో ప్రయోజనం పొందుతుంది'
Modi With Saudi Prince : దిల్లీలోని హైదరాబాద్​ హౌస్​లో మోదీ, మహ్మద్​ బిన్​ సల్మాన్​లు.. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. ఇరు దేశాల సన్నిహత భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు అనేక మార్గాలు అన్వేషించామని మోదీ తెలిపారు. మరోవైపు, భారత్​లో పర్యటించడం సంతోషంగా ఉందని సౌదీ యువరాజు మహ్మద్​ బిన్​ సల్మాన్​ తెలిపారు. జీ20 సదస్సును నిర్వహించినందుకు భారత్‌ను అభినందిస్తున్నట్లు తెలిపారు. ఈ సదస్సు వల్ల యావత్‌ ప్రపంచం ఎంతో ప్రయోజనం పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరు దేశాల గొప్ప భవిష్యత్తు కోసం రెండు దేశాలు కలిసి పనిచేస్తాయని పేర్కొన్నారు.

  • His Royal Highness Prince Mohammed bin Salman bin Abdulaziz Al Saud and I had very productive talks. We reviewed our trade ties and are confident that the commercial linkages between our nations will grow even further in the times to come. The scope for cooperation in grid… pic.twitter.com/UalSTDmrTY

    — Narendra Modi (@narendramodi) September 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

తొలిసారి భారత్​కు..
Saudi Prince India Visit : దిల్లీలో రెండు రోజులపాటు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన జీ20 సదస్సులో పాల్గొనేందుకు భారత్​కు తొలిసారి మహ్మద్​ బిన్​ వచ్చారు. సదస్సు అయ్యాక ఆయన భారత్​లో పర్యటిస్తున్నారు. అయితే మోదీతో ద్వైపాక్షిక చర్చలకు ముందు సౌదీ యువరాజుకు రాష్ట్రపతి భవన్ వెలుపల లాంఛనప్రాయ స్వాగతం లభించింది.

  • #WATCH | Crown Prince and Prime Minister of the Kingdom of Saudi Arabia Prince Mohammed bin Salman bin Abdulaziz Al Saud attends a ceremonial reception at Rashtrapati Bhavan.

    He also met President Droupadi Murmu, Prime Minister Narendra Modi and other ministers during the… pic.twitter.com/HWET5vsmB1

2019లో భాగస్వామి మండలి ప్రకటన..
India Saudi Arabia Relations : భారత్‌కు వ్యూహాత్మక భాగస్వాముల్లో సౌదీ అరేబియా కీలక దేశంగా ఉంది. గత కొన్నేళ్లుగా తీసుకుంటున్న చర్యలతో ఇరుదేశాల సంబంధాలు ఉన్నతస్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా రక్షణ, భద్రతను మరింత బలోపేతం చేసేందుకు ఇరు దేశాలు కృషి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌-సౌదీ వ్యూహాత్మక భాగస్వామ్య మండలిని 2019లో ప్రకటించారు. 2020 డిసెంబర్‌లో అప్పటి భారత చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌ జనరల్‌ ఎంఎ నరవణె కూడా సౌదీ అరేబియాలో తొలిసారి పర్యటించారు. ఆ తర్వాత ఇరుదేశాల సైనిక ఉన్నతాధికారుల మధ్య రాకపోకలు సాగుతున్నాయి.

Modi Biden Bilateral Talks : మోదీతో బైడెన్​ కీలక చర్చలు.. భారత్​కు భద్రతా మండలి సభ్యత్వానికి మద్దతు.. 2028లోనే..

Modi Sunak Bilateral Talks : రిషి సునాక్​తో మోదీ ద్వైపాక్షిక చర్చలు.. బైడెన్​తో బంగ్లా ప్రధాని సెల్ఫీ

Modi Bilateral Talks : దేశాధినేతలతో మోదీ బిజీబిజీ.. కెనడా ప్రధానితో 'ఖలిస్థానీ' నిరసనలపై చర్చ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.