Modi On Employment : పునరుత్పాదక ఇంధనం, రక్షణ పరిశ్రమ, ఆటోమేషన్ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఉపాధి అవకాశాలను పెంచిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో శనివారం జరిగిన రోజ్‌గార్ మేళాను ఉద్దేశించి ప్రధాని మోదీ వర్చువల్గా ప్రసంగించారు. కేంద్ర సాయుధ బలగాలకు ఎంపికైన 51వేలకు పైగా ఉద్యోగులకు ఈ సందర్భంగా నియామక పత్రాలు అందజేశారు.
-
VIDEO | PM Modi virtually distributes 51,000 appointment letters to new recruits at Rozgar Mela. pic.twitter.com/ZAakaJRsDN
— Press Trust of India (@PTI_News) October 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">VIDEO | PM Modi virtually distributes 51,000 appointment letters to new recruits at Rozgar Mela. pic.twitter.com/ZAakaJRsDN
— Press Trust of India (@PTI_News) October 28, 2023VIDEO | PM Modi virtually distributes 51,000 appointment letters to new recruits at Rozgar Mela. pic.twitter.com/ZAakaJRsDN
— Press Trust of India (@PTI_News) October 28, 2023
కొన్ని లక్షల మందికి..
"గతేడాది అక్టోబర్లో ప్రారంభించిన రోజ్‌గార్ మేళా.. అరుదైన మైలురాయిని చేరుకుంది. అప్పటి నుంచి కొన్ని లక్షల మందికి అపాయింట్‌మెంట్ లెటర్‌లు అందించాం. నేడు 51,000 మందికి పైగా అపాయింట్‌మెంట్ లెటర్‌లు పంపిణీ చేశాం. కొత్త రిక్రూట్ అయిన కుటుంబాలుకు ఇది దీపావళికి ముందు దివాళి పండుగ లాంటిది" అని ప్రధాని మోదీ తెలిపారు.
-
VIDEO | "Rozgar Mela shows our commitment towards the youth. Our government is working in mission mode keeping the future of youth in mind. We are not only distributing appointment letters but have also made the system transparent," says PM Modi while addressing Rozgar Mela. pic.twitter.com/8t3emUwNwF
— Press Trust of India (@PTI_News) October 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">VIDEO | "Rozgar Mela shows our commitment towards the youth. Our government is working in mission mode keeping the future of youth in mind. We are not only distributing appointment letters but have also made the system transparent," says PM Modi while addressing Rozgar Mela. pic.twitter.com/8t3emUwNwF
— Press Trust of India (@PTI_News) October 28, 2023VIDEO | "Rozgar Mela shows our commitment towards the youth. Our government is working in mission mode keeping the future of youth in mind. We are not only distributing appointment letters but have also made the system transparent," says PM Modi while addressing Rozgar Mela. pic.twitter.com/8t3emUwNwF
— Press Trust of India (@PTI_News) October 28, 2023
"రోజ్‌గార్ మేళా.. యువత పట్ల మా ప్రభుత్వం నిబద్ధతను చూపుతుంది. యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎన్డీఏ సర్కార్ మిషన్ మోడ్లో పనిచేస్తోంది. మేం కేవలం అపాయింట్‌మెంట్ లెటర్లను పంపిణీ చేయడమే కాకుండా.. వ్యవస్థను పారదర్శకంగా మార్చాం. భారత్.. కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించింది. కొద్ది రోజుల క్రితం.. గుజరాత్లోని ధోర్డో గ్రామాన్ని ఐక్యరాజ్యసమితి ఉత్తమ పర్యటక గ్రామంగా ప్రకటించింది. అంతకుముందు కర్ణాటకలోని హోయసల ఆలయం, బంగాల్లోని శాంతినికేతన్ ప్రపంచ వారసత్వ దేశాలుగా గుర్తించింది. ఇది ఉపాధి అవకాశాలను, ఆర్థిక వ్యవస్థ విస్తరణను పెంచింది. పర్యటకం పెరిగితే ప్రతి రంగానికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి" అని మోదీ చెప్పారు.
-
VIDEO | "Rozgar Mela has reached an important milestone. The journey was started in October last year. Since then, lakhs of people have been given appointment letters and today, more than 51,000 appointment letters have been distributed. This is like a Diwali before Diwali for… pic.twitter.com/DhK5Z54zfR
— Press Trust of India (@PTI_News) October 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">VIDEO | "Rozgar Mela has reached an important milestone. The journey was started in October last year. Since then, lakhs of people have been given appointment letters and today, more than 51,000 appointment letters have been distributed. This is like a Diwali before Diwali for… pic.twitter.com/DhK5Z54zfR
— Press Trust of India (@PTI_News) October 28, 2023VIDEO | "Rozgar Mela has reached an important milestone. The journey was started in October last year. Since then, lakhs of people have been given appointment letters and today, more than 51,000 appointment letters have been distributed. This is like a Diwali before Diwali for… pic.twitter.com/DhK5Z54zfR
— Press Trust of India (@PTI_News) October 28, 2023
Rozgar Mela 2023 November : రోజ్‌గార్ మేళాలో నియామక పత్రాలు అందుకున్న ఉద్యోగులు.. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉద్యోగాల్లో చేరనున్నారు. రెవెన్యూ శాఖ, ఆర్థిక సేవల విభాగం, పోస్టల్, పాఠశాల విద్యా శాఖ, ఉన్నత విద్యా శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, జలవనరుల శాఖ సహా వివిధ మంత్రిత్వ శాఖలు/విభాగాల్లో విధులు నిర్వర్తించనున్నారు. ఎన్నికల సమయంలో దేశంలో 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన ప్రధాని మోదీ.. గతేడాది అక్టోబర్ 22న రోజ్‌గార్ మేళా మొదటి దశను ప్రారంభించారు.
PM Rojgar Mela : 'వృద్ధిబాటలో భారత ఆర్థిక వ్యవస్థ.. యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు'
Modi Rojgar Mela : 'మహిళలకు బీజేపీ సర్కార్ సరికొత్త ద్వారాలు.. అన్ని రంగాల్లోనూ ముందంజ'