భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ- బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా నిర్వహించిన వర్చువల్ సదస్సు కీలక ప్రాజెక్టుల ప్రారంభం, సమగ్ర చర్చలతో ఫలప్రదమైనదిగా పేర్కొంది భారత విదేశాంగ శాఖ. ఈ సదస్సులో ప్రధానంగా మయన్మార్ రాఖైన్ రాష్ట్రానికి చెందిన రోహింగ్యాలను సురక్షితంగా, త్వరితగతిన తిరిగి స్వదేశానికి పంపించాల్సిన అవసరం ఉందని చర్చించినట్లు తెలిపింది.
"కీలక ప్రాజెక్టుల ప్రారంభం, సమగ్ర చర్చలతో ఈ సదస్సు ఫలప్రదమైనది. ఈ ద్వైపాక్షిక సదస్సులో.. రాఖైన్ రాష్ట్రానికి చెందిన నిరాశ్రయ రోహింగ్యాలను సురక్షితంగా, సత్వరం మయన్మార్‌కు తిరిగి పంపించాలని ఇరు దేశాలు అంగీకరించాయి. ఈ అంశంపైనే ప్రధానంగా చర్చించాయి. సుమారు 11 లక్షల మంది నిరాశ్రయ రోహింగ్యాలకు ఆతిథ్యం ఇస్తున్న బంగ్లాదేశ్ మానవతకు అభినందిస్తున్నాం. అర్థం చేసుకున్నాం. "
- స్మితా పంత్, బంగ్లాదేశ్-మయన్మార్ సంయుక్త కార్యదర్శి, విదేశాంగ శాఖ.
మయన్మార్‌లోని రాఖైన్ రాష్ట్రం నుంచి వచ్చిన సుమారు 11 లక్షల మంది నిరాశ్రయ రోహింగ్యాలకు ఆశ్రయం కల్పించటంపై ప్రధాని మోదీ అభినందించారని పేర్కొన్నారు స్మితా పంత్. బంగ్లాదేశ్‌లోని రోహింగ్యాలను మయన్మార్ పంపించే కార్యక్రమానికి భారత్ సాయం చేస్తుందనే నమ్మకం ఉన్నట్లు హసీనా వెల్లడించినట్లు తెలిపారు.
ఇదీ చూడండి: 7 ఒప్పందాలతో భారత్- బంగ్లా స్నేహగీతం