ETV Bharat / bharat

'కేంద్రం విధానం వల్ల.. వారికి రూ.లక్ష కోట్లు లాభం' - vaccine profit covid policy

మోదీ సర్కార్ తీసుకొచ్చిన టీకా విధానం వల్ల వ్యాక్సిన్ తయారీ సంస్థలు రూ.1.11 లక్షల కోట్ల లాభాన్ని ఆర్జిస్తాయని కాంగ్రెస్ విమర్శించింది. ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో లాభాలను వెనకేసుకునేందుకు మోదీ ప్రభుత్వం ఎందుకు అనుమతిస్తోందని ప్రశ్నించింది. మరోవైపు, కరోనా మరణాలను కేంద్రం దాస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు.

Congress
'కేంద్రం విధానం వల్ల.. వారికి రూ.లక్ష కోట్ల లాభం'
author img

By

Published : Apr 25, 2021, 7:37 PM IST

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన కొవిడ్ టీకా విధానాన్ని వివక్షపూరితమైనదని పేర్కొంది కాంగ్రెస్. వ్యాక్సిన్ తయారీ సంస్థలు రూ.1.11 లక్షల కోట్ల లాభాన్ని వెనకేసుకునేందుకు మోదీ ప్రభుత్వం అనుమతిస్తోందని ఆరోపించింది. పేద ప్రజలకు టీకా ఉచితంగా అందించాల్సిన బాధ్యతను విస్మరించిందని ధ్వజమెత్తింది.

ఈ మేరకు వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్​లో మాట్లాడిన కాంగ్రెస్ ప్రతినిధి సుర్జేవాలా.. వ్యాక్సినేషన్ అనేది ప్రచార కార్యక్రమం కాదని కేంద్రానికి హితవు పలికారు. ప్రపంచంలోనే అత్యంత వివక్షపూరితమైన టీకా విధానాన్ని మోదీ సర్కారు ప్రవేశపెట్టిందని ఆక్షేపించారు. సీరం ఇన్​స్టిట్యూట్, భారత్​ బయోటెక్ నిర్ణయించిన ధరల ప్రకారం టీకా విక్రయం వల్ల ఆయా సంస్థలు వరుసగా.. రూ.35,350 కోట్లు, రూ.75,750 కోట్ల లాభాన్ని నమోదు చేస్తాయని చెప్పుకొచ్చారు. ఇది దేశంలోని 101 కోట్ల (18-45 ఏళ్ల మధ్య) జనాభాలో సగం మంది టీకాను కొనుగోలు చేస్తే వచ్చే లాభమని పేర్కొన్నారు.

"వ్యాక్సిన్​పై ఈ విధంగా లాభాలు సంపాదించడాన్ని ఎలా అనుమతిస్తారు? మహమ్మారి సమయంలో ఇలా లాభాలను వెనకేసుకునేందుకు మోదీ ప్రభుత్వం ఎందుకు అనుమతిస్తోంది. ప్రధానమంత్రి దీనికి సమాధానం చెప్పాలి. సార్వజన టీకా పంపిణీ అనేది ప్రచార కార్యక్రమం కాదు. ఇది ప్రజలకు సేవ చేసేందుకు నిర్ణయించుకున్న లక్ష్యం. ఇలాంటివి వ్యాపార ప్రయోజనాలు కాకూడదు."

-రణదీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ ప్రతినిధి

మరణాలు తక్కువ

మరోవైపు, కరోనా మరణాలను ప్రభుత్వం దాస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆక్సిజన్ కొరతనూ ప్రభుత్వం అంగీకరించడం లేదని మండిపడ్డారు. ఈ మేరకు ట్వీట్ చేసిన ఆయన.. ప్రముఖ పత్రిక న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని షేర్ చేశారు.

  • Shroud the truth
    Deny oxygen shortage
    Underreport deaths

    GOI is doing everything...

    ...to save his fake image! pic.twitter.com/AfizkPPGGG

    — Rahul Gandhi (@RahulGandhi) April 25, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"నిజాన్ని కప్పేయడం. ఆక్సిజన్ కొరతను తిరస్కరించడం. మరణాలను తక్కువగా నమోదు చేయడం. భారత ప్రభుత్వం తన తప్పుడు ఇమేజ్​ను కాపాడుకునేందుకు ప్రతీదీ చేస్తోంది."

-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత

కొవిడ్ మృతదేహాలకు అంత్యక్రియలు చేస్తున్న ఫొటోతో.. కరోనా మరణాలను తక్కువగా నమోదు చేస్తున్నారనే హెడ్​లైన్​తో ఈ కథనాన్ని ప్రచురించింది న్యూయార్క్​ టైమ్స్.

ఇదీ చదవండి- 'వ్యవస్థ విఫలం.. ఇప్పుడు కావాల్సింది 'జన్​కీ బాత్''

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.