Modi cabinet meeting decision: సెమీకండక్టర్స్‌పై కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం ఆ రంగంలో పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. తయారీని పెంచటం ద్వారా ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం బలోపేతమవుతుందని ట్వీట్ చేశారు మోదీ.
-
Today’s Cabinet decision on semi-conductors will encourage research and innovation in the sector. It will also boost manufacturing and thus strengthen the dream of an Aatmanirbhar Bharat. https://t.co/HcuY318EZ1
— Narendra Modi (@narendramodi) December 15, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Today’s Cabinet decision on semi-conductors will encourage research and innovation in the sector. It will also boost manufacturing and thus strengthen the dream of an Aatmanirbhar Bharat. https://t.co/HcuY318EZ1
— Narendra Modi (@narendramodi) December 15, 2021Today’s Cabinet decision on semi-conductors will encourage research and innovation in the sector. It will also boost manufacturing and thus strengthen the dream of an Aatmanirbhar Bharat. https://t.co/HcuY318EZ1
— Narendra Modi (@narendramodi) December 15, 2021
" సెమీకండక్టర్స్‌పై ఈరోజు మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం.. ఆ రంగంలో పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది. అలాగే.. తయారీని పెంచుతుంది. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాన్ని బలోపేతం చేస్తుంది."
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
భారత్‌ను హైటెక్ ఉత్పత్తికి ప్రపంచ కేంద్రంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా సెమీకండక్టర్ల అభివృద్ధి, తయారీ పర్యావరణ వ్యవస్థ కోసం.. రూ.76వేల కోట్లతో కూడిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకానికి కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. రోజువారీ జీవితంలో ఎలక్ట్రానిక్స్ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో వాటి తయారీలో సెమీకండక్టర్ చిప్పులు కీలక భాగమని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోటీని తట్టుకునేలా దేశీయ సెమీకండక్టర్స్ కంపెనీలకు ప్రోత్యాహక ప్యాకేజీని అందించటం ద్వారా.. ఈ పథకం ఎలక్ట్రానిక్స్ తయారీలో కొత్త శకానికి నాంది పలుకుతుందన్నారు. ఇది వ్యూహాత్మక ప్రాముఖ్యత, ఆర్థిక స్వావలంబన దిశగా దేశ సాంకేతిక నైపుణ్యాన్ని బలోపేతం చేస్తుందని తెలిపారు.
అలాగే.. యూపీఐ, రుపీ డెబిట్ కార్డుతో జరిపిన డీజిటల్ లావాదేవీలకు సంబంధించి రూ.1300 కోట్ల రీఎంబర్స్మెంట్ చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నవంబర్ నెలలో రూ. 7.56 లక్షల కోట్ల విలువైన 423 కోట్ల డిజిటల్ లావాదేవీలు జరిగినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు వచ్చే ఏడాది రూ.13వందల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు చెప్పారు.
ఇదీ చూడండి:
ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఛార్జీల రీఫండ్- కేంద్రం కీలక నిర్ణయం