ETV Bharat / bharat

దీపావళికి స్వదేశీ వస్తువులే కొనండి: మోదీ - మోదీ తాాజా వార్తలు

స్వదేశీ వస్తువులకు ప్రోత్సాహం అందించేందుకు దీపావళి రూపంలో గొప్ప అవకాశం లభించిందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఈ పండుగ వేళ ప్రతి ఒక్కరూ స్వదేశీ ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందన్నారు.

PM-LOCAL
మోదీ
author img

By

Published : Nov 9, 2020, 12:57 PM IST

దీపావళి సందర్భంగా స్వదేశీ వస్తువులనే కొనాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త శక్తిని ఇస్తుందని తెలిపారు. వారణాసిలో అభివృద్ధి కార్యక్రమాలను వర్చువల్​ ప్రారంభించిన మోదీ.. దేశ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సందేశం ఇచ్చారు.

"దీపావళి సందర్భంగా దేశంలో స్వదేశీ మంత్రం వినిపిస్తోంది. నేను దేశ ప్రజలందరికీ ఓ విషయం చెప్పాలనుకుంటున్నా. దీపావళి రూపంలో స్వదేశీ వస్తువులకు ప్రోత్సహం అందించడానికి గొప్ప సమయం దొరికింది. ప్రతి ఒక్కరూ గర్వంగా స్వదేశీ వస్తువులనే కొనుగోలు చేయాలి. వాటి గురించి మాట్లాడాలి. ప్రశంసించాలి. ఇతరులకు చెప్పాలి."

- నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

స్వదేశీ వస్తువులకు ప్రోత్సాహం అంటే.. దివ్వెలను కొనడమే కాదు, వాటిని దీపావళికి వెలిగించాలని మోదీ అన్నారు. ఇది తయారీదారుల్లో విశ్వాసం కలిగిస్తుందన్నారు.

ఇదీ చూడండి: వారణాసిలో 614 కోట్ల అభివృద్ధి పనులకు మోదీ శ్రీకారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.