ETV Bharat / bharat

'సేంద్రియ సాగుతోనే రైతు ఇంట సిరుల పంట' - ప్రకృతి వ్యవసాయంపై ప్రధాని మోదీ ప్రసంగం

Modi addresses farmers: రైతులు.. సేంద్రియ వ్యవసాయానికి మారాల్సిన అవసరముందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రకృతి వ్యవసాయంపై దృష్టిసారించాలని రైతులకు సూచించారు. వ్యవసాయాన్ని రసాయన ప్రయోగశాలల నుంచి బయటకు తీసుకొచ్చి.. ప్రకృతికి అనుసంధానం చేయాలని కోరారు.

Modi addresses farmers
Modi addresses farmers
author img

By

Published : Dec 16, 2021, 1:16 PM IST

Updated : Dec 16, 2021, 5:30 PM IST

Modi natural farming: వ్యవసాయాన్ని రసాయన ప్రయోగశాలల నుంచి బయటకు తీసుకొచ్చి.. ప్రకృతికి అనుసంధానం చేయాలని ఆకాంక్షించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రకృతి సేద్యం వైపు మారాలని రైతులను కోరారు. గుజరాత్​లోని ఆనంద్​లో నిర్వహించిన.. ప్రకృతి సేత్యం, ఆగ్రో, ఫుడ్​ ప్రాసెసింగ్​ జాతీయ సదస్సులో వర్చువల్​గా ప్రసంగించారు మోదీ. ప్రకృతి వ్యవసాయం ఆవశ్యకతను తెలియజేశారు. పంట వ్యర్థాలను కాల్చటంపై ఆందోళన వ్యక్తం చేశారు. అది వ్యవసాయ భూమి ఉత్పాదకతకు హాని చేకూర్చుతుందని అన్నారు.

" వ్యవసాయంలో భాగమైన తప్పులను సరిదిద్దాల్సిన సమయం వచ్చింది. హరిత విప్లవంలో రసాయనాలు, ఎరువులు కీలక పాత్ర పోషించాయి. కానీ, వాటి ప్రత్యామ్నాయాలపై పని చేయాల్సిన అవసరాన్ని సూచించాయి. వ్యవసాయానికి సంబంధించిన సమస్యలు తీవ్రతరం కాకముందే మేల్కొనేందుకు ఇదే సరైన సమయం. చికిత్స కన్నా నిరోధించటమే ఎల్లప్పుడూ సరైనది. ఎరువులు, రసాయనాలను ఎక్కువ ధరలకు దిగుమతి చేసుకోవటం ద్వారా పెట్టుబడి వ్యయం పెరిగిపోతోంది. దాని ద్వారా సామాన్యుడిపై భారం పడుతోంది. "

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

వ్యవసాయ రంగంలో మార్పులు తెచ్చేందుకు ఫుడ్​ ప్రాసెసింగ్​, సేంద్రియ వ్యవసాయం దోహదపడతాయని పేర్కొన్నారు ప్రధాని. ఈ సదస్సులో వర్చువల్​గా 8 కోట్ల మంది రైతులు పాల్గొన్నారని.. ఇది కేవలం గుజరాత్​కే పరిమితం కాకూడదని సూచించారు. దేశంలోని రైతులందరికీ ప్రయోజన చేకూరుతుందని తెలిపారు. సేంద్రియ వ్యవసాయంతో దేశంలోని 80 శాతం మంది సన్నకారు రైతులకు ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని.. కానీ.. 5 ఎకరాల్లోపు రైతులు రసాయనిక ఎరువుల కోసం విపరీతంగా ఖర్చు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సైన్స్​ ఆధారిత వ్యవసాయంలో విత్తనాల నుంచి నేల వరకు అన్నీ సహజంగానే సేకరించవచ్చని వివరించారు.

ల్యాబ్​ టూ ల్యాండ్​

ల్యాబ్​ టూ ల్యాండ్​ విధానాన్ని దేశంలోని అన్ని వ్యవసాయ వర్సిటీలు, ఇతర సంస్థలు భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి(ఐసీఏఆర్​) తీసుకుని ఆ దిశగా కృషి చేయాలని కోరారు. ప్రకృతి వ్యవసాయంపై పరిశోధనలు సాగించి రైతులకు లబ్ధి చేకూరేలా చూడాలన్నారు. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రజాఉద్యమంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ప్రస్తుతం కనీసం ప్రతి పంచాయతీలో ఒక్క గ్రామమైనా సేంద్రీయ వ్యవసాయంలోకి మారేలా చూడాలన్నారు.

ల్యాబ్​ల ఏర్పాటుకు కేంద్ర ప్రయత్నాలు..

భూమిని ఆడిట్​ చేయడానికి, సేంద్రియ ఉత్పత్తులను ధ్రువీకరించేందుకు పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. అముల్​ వంటి సంస్థలు ఆ దిశగా పని చేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ చర్యలు సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తాయని తెలిపారు. 2019 నుంచి రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు వెళ్లాలని ప్రధాని మోదీ కోరుతున్నారని, ప్రస్తుతం ఆర్గానిక్​ ఉత్పత్తులు అవసరమన్నారు.

ఇదీ చదవండి: జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమర వీరులకు ప్రధాని నివాళి

Last Updated : Dec 16, 2021, 5:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.