అమెరికాకు చెందిన ప్రముఖ కరోనా వ్యాక్సిన్ తయారీ సంస్థ మోడెర్నా.. పంజాబ్ ప్రభుత్వానికి టీకాలు ఇవ్వలేమని తేల్చిచెప్పింది. తాము నేరుగా కేంద్రంతో మాత్రమే సంప్రదింపులు జరుపుతామని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర సీనియర్ అధికారి ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
అంతకుముందు రాష్ట్ర ప్రజలందరికీ టీకా అందించేందుకు అన్ని వనరుల నుంచి వ్యాక్సిన్లను సేకరించాలని.. గ్లోబల్ టెండర్ల ద్వారా టీకా లభ్యత అవకాశాలను పరిశీలించాలని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ అధికారులను ఆదేశించారు.
"సీఎం అమరీందర్ సింగ్ ఆదేశాల మేరకు వ్యాక్సిన్ కొనుగోలుకు మోడెర్నా సహా.. స్పుత్నిక్-వి, ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థలతో నేరుగా సంప్రదించాం. మోడెర్నా నుంచి మాత్రమే సమాధానం వచ్చింది."
-వికాస్ గార్గ్, పంజాబ్ వ్యాక్సిన్ కార్యక్రమం నోడల్ అధికారి.
ఇవీ చదవండి: వైరస్ టాస్క్ఫోర్స్లో భారతీయ టెక్ సీఈఓలు