ETV Bharat / bharat

కుమార్తెకు రూ.12వేలతో ఫోన్​ కొని.. రూ.8వేలతో ఊరేగింపు - shivpuri tea seller dance

పిల్లల ఆనందం కోసం కొండమీద కోతినైనా తెచ్చివ్వడానికి సిద్ధపడతాడు తండ్రి. ఎలాంటి కష్టనష్టాలనైనా భరిస్తాడు. మధ్యప్రదేశ్‌లోని శివపురిలో జరిగిన ఘటన అందుకు నిదర్శనంగా నిలుస్తోంది. తన కుమార్తెకు ఓ మొబైల్‌ కొని.. ఊరేగింపుగా ఇంటికి తీసుకెళ్లాడు ఓ తండ్రి.

mobile procession
mobile procession
author img

By

Published : Dec 22, 2021, 10:52 AM IST

Updated : Dec 22, 2021, 12:06 PM IST

ఊరేగింపుగా ఇంటికి తీసుకెళ్తున్న ఫోన్​

Mobile Procession: పిల్లల సంతోషం కోసం తండ్రి ఎలాంటి కష్టనష్టాలనైనా భరిస్తాడు. మధ్యప్రదేశ్‌లోని శివపురి, సత్నాల్లో జరిగిన రెండు ఘటనలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

శివపురిలోని నీలగిరి చౌరాశాలో టీ దుకాణం నిర్వహించే మురారి తన కుమార్తె కోసం మంగళవారం రూ.12,500 విలువైన మొబైల్‌ ఫోన్‌ కొన్నారు. దానిని ఇంటికి తెచ్చేందుకు గుర్రపు బండిలో, బ్యాండు మేళం, డీజే ఏర్పాటు చేశారు. తన కుమార్తెకు మొబైల్‌ ఇచ్చి గుర్రపు బండిపై కూర్చోబెట్టారు. అనంతరం రహదారిపై నృత్యం చేస్తూ ఊరేగింపుగా ఇంటికి తీసుకెళ్లారు. కుటుంబ సంతోషం కోసం మురారి చేసిన పనిపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఊరేగింపు కోసం మురారి ఏకంగా రూ.8,000 ఖర్చు పెట్టడం విశేషం.

mobile procession
గుర్రపు బండిలో ఊరేగింపుగా ఫోన్​
mobile procession
ఫోన్​ ఊరేగింపులో డీజే పాటలు, నృత్యాలు

"నేను మద్యం సేవిస్తాను. నా ఐదేళ్ల కుమార్తె మొబైల్‌ కావాలని అడిగింది. ఫోన్‌ కొనమని పట్టుబట్టింది. కొనిస్తానని ఆమెకు హామీ ఇచ్చాను" అని మురారి చెప్పారు.

చంద్రుడిపై ఎకరం స్థలం

మరోవైపు, ఈ నెల 16న సత్నాకు చెందిన అభిలాష్‌ మిశ్ర అనే వ్యక్తి తన కుమారుడు అవ్యాంష్‌ మిశ్రా కోసం చంద్రుడిపై ఎకరం స్థలం కొనుగోలు చేశారు. ఇందుకు కోసం రూ.లక్ష వెచ్చించారు. కుమారుడి రెండో పుట్టిన రోజు సందర్భంగా స్థలాన్ని రిజిస్ట్రేషన్‌ చేయించారు.

ఇదీ చూడండి: టీచర్ల విరాళాలతో సర్కారీ బడికి కార్పొరేట్ హంగులు!

Last Updated : Dec 22, 2021, 12:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.