MLC Kavitha Responded to ED Notices : ఈడీ నోటీసులపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. తనకు మోదీ నోటీసు వచ్చిందని పేర్కొన్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా వచ్చిన నోటీసు అదని.. దానిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. తనకు అందిన నోటీసును పార్టీ లీగల్ టీమ్‌కు ఇచ్చామని స్పష్టం చేశారు. లీగల్ టీమ్ సలహా ప్రకారం ముందుకెళ్తామన్నారు. ఇది ఏడాది కాలంగా కొనసాగుతూనే ఉందన్న కవిత.. టీవీ సీరియల్‌లా దీనిని కొనసాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికలు వచ్చాయని.. మళ్లీ ఒక ఎపిసోడ్ రిలీజ్ చేస్తున్నారని విమర్శించారు. ఈ కేసులో ఏడాదిగా విచారణ కొనసాగుతూనే ఉందని.. ప్రస్తుత నోటీస్‌ను సీరియస్‌గా తీసుకోవద్దన్నారు. ఈ విచారణ ఎంతకాలం కొనసాగుతుందో తెలియదన్న ఆమె.. తెలంగాణ ప్రజలు కూడా దీనిని సీరియస్‌గా తీసుకోరని స్పష్టం చేశారు.
MLC Kavitha: 'కేసీఆర్‌ను ఎదుర్కొనే ధైర్యం లేకే నాపై ఆరోపణలు'
నాకు మోదీ నోటీసు వచ్చింది. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా వచ్చిన నోటీసు అది. నోటీసును పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నోటీస్‌ను పార్టీ లీగల్ టీమ్‌కు ఇచ్చాం. లీగల్ టీమ్ సలహా ప్రకారం నోటీసుపై ముందుకెళ్తాం. ఇది ఏడాది కాలంగా కొనసాగుతూనే ఉంది. టీవీ సీరియల్‌లా దీన్ని కొనసాగిస్తున్నారు. ఎన్నికలు వచ్చాయి.. మళ్లీ ఒక ఎపిసోడ్ రిలీజ్ చేస్తున్నారు. నోటీసును సీరియస్‌గా తీసుకోవద్దు. తెలంగాణ ప్రజలు కూడా దీన్ని సీరియస్‌గా తీసుకోరు. బీఆర్‌ఎస్ పార్టీ ఎవరికీ బీ టీమ్ కాదు. ప్రజలకు, దేశానికి ఏ టీమ్. - ఎమ్మెల్సీ కవిత
శుక్రవారం విచారణకు రావాలంటూ నోటీసులు..: సంచలనం సృష్టించిన దిల్లీ మద్యం కుంభకోణం (Delhi Liquor Scam Case) కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. శుక్రవారం విచారణకు రావాల్సిందిగా ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో దినేశ్ అరోరా, అరుణ్ రామచంద్రన్ పిళ్లై, శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాస రెడ్డి, మాగుంట రాఘవ తదితర నిందితులు ఇప్పటికే అప్రూవర్లుగా మారారు. ఈ కేసులో మార్చి 16, 20, 21 తేదీల్లో దిల్లీలో కవితను విచారించిన ఈడీ.. తాజాగా మరోసారి నోటీసులు జారీ చేసింది.
Delhi Liquor Scam: దిల్లీ లిక్కర్ స్కామ్.. ఈడీ అనుబంధ ఛార్జీషీట్లపై ఈనెల 10న విచారణ
దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే పలుమార్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ ఎదుర్కొన్నారు. మార్చి నెలలో దిల్లీలోని ఈడీ కార్యాలయంలో అధికారులు ఆమెను సుదీర్ఘంగా విచారించారు. ఆమె పాత ఫోన్లనూ పరిశీలించారు. కవిత కొన్ని నెలల్లోనే 10 ఫోన్లు మార్చారని.. ఆ ఫోన్లను ధ్వంసం చేశారని ఈడీ తన ఛార్జీషీట్‌లో పేర్కొంది. మద్యం కేసు ఆధారాలున్న ఫోన్లను ధ్వంసం చేశారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వెల్లడించింది. ఈ క్రమంలో ఆ 10 ఫోన్లను కవిత ఈడీ అధికారులకు అప్పగించారు.
దిల్లీ లిక్కర్ స్కామ్.. ఎమ్మెల్సీ కవిత సెల్ ఫోన్లలోని డేటా సేకరణ