MLA Nandamuri Balakrishna Fires on YSRCP Government: తన వృత్తిని, తెలుగు సినిమా కళాకారులను వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఘోరంగా అవమానించారని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ధ్వజమెత్తారు. అసెంబ్లీ సమావేశాల నుంచి సస్పెండ్ అయ్యాక.. సభ నుంచి బయటకు వచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. తుళ్లూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద టీడీపీ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు.
సినీ రంగం నుంచే ఎన్టీఆర్ అసెంబ్లీకి వెళ్లి ఎందరికో రాజకీయ భిక్ష పెట్టారని ఆయన గుర్తుచేశారు. సభలో తానొక్కడికే అవమానం జరగలేదని, మొత్తం తెలుగు సినీ పరిశ్రమని అధికారపార్టీ నేతలు కించపరిచారని ఆరోపించారు. చంద్రబాబుపై కేసు అక్రమం, దీనిపై పోరాటం ఆపేది లేదని బాలకృష్ణ స్పష్టం చేశారు.
Lokesh Comments on CBN Security: చంద్రబాబుకు జైలులో ఏం జరిగినా జగన్‌దే బాధ్యత: లోకేశ్
అలా చేసింది వైసీపీ ఎమ్మెల్యేలే: అసెంబ్లీలో మీసం మెలేసి, తొడ కొట్టిందీ వైసీపీ ఎమ్మెల్యేలేనన్న ఆయన.. తాను చేయని పనిని చేసినట్లు అసత్యాలు సృష్టించి, స్పీకర్‌తో అబద్దాలు చెప్పించారని దుయ్యబట్టారు. మంద బలంతో విర్రవీగుతున్న వైసీపీ ఎమ్మెల్యేలకు తగిన మూల్యం తప్పదని, ప్రజలే వారికి త్వరలో బుద్ధి చెప్తారని బాలకృష్ణ హెచ్చరించారు.
వైసీపీపై అచ్చెన్నాయుడు ధ్వజం తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై అక్రమ కేసు పెట్టి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. చంద్రబాబుపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకుని అసెంబ్లీలో సీఎం జగన్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్‌చేశారు. ఇదే నినాదంతో అసెంబ్లీకి వెళ్లామని తెలిపారు.
ఇవాళ అసెంబ్లీకి ఒక దురదృష్టకర రోజు అని పేర్కొన్న అచ్చెన్న.. 200 మంది మార్షల్స్‌ను పెట్టి సభ జరుపుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని విమర్శించారు. స్పీకర్ తీరు చాలా దారుణంగా ఉందని మండిపడ్డారు. మంత్రి నేరుగా మీసం మెలిసి బూతులు తిట్టినా ఎలాంటి చర్యలు లేవని అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు.
అసెంబ్లీలో సస్పెండ్ అనంతరం మల్కాపురం గ్రామంలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు మీడియా సమావేశం నిర్వహించారు. అదే విధంగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఇటీవల రిమాండ్ ఖైదీ చనిపోయారని అచ్చెన్న అన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుకు భద్రత లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
Nandamuri Balakrishna Wiped Woman Tears: మహిళ కన్నీళ్లు తుడిచిన బాలకృష్ణ.. అధైర్యపడొద్దంటూ భరోసా
పయ్యావుల కేశవ్: శాసనసభ అంటే పార్టీ ఆఫీసని వైసీపీ నేతలు అనుకుంటున్నారని పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని తెలిపారు. ఏ కేసులో అయినా ఆధారాలుంటే అరెస్టు చేస్తారని.. కానీ ఈ కేసులో అరెస్టు చేశాక ఆధారాలు వెతుకుతున్నామని కోర్టులకు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.
రాష్ట్ర శాసనసభకు ఇవాళ బ్లాక్ డే అని పయ్యావుల పేర్కొన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి బయటకు రావాలంటే పరదాలు కట్టాల్సిందేనని అన్నారు. ముందస్తు అరెస్టులు, నిర్బంధాలు చేశాకే సీఎం బయటకు వస్తున్నారని విమర్శించారు. కేసులకు, నిర్బంధాలకు వెనక్కి తగ్గేది లేదని.. తమ పోరాటం కొనసాగిస్తామని పయ్యావుల కేశవ్ తెలిపారు.
TDP MLAs MLCs Condemned Chandrababu Arrest: ఈ పోరాటం ఇంతటితో ఆగేది కాదు.. ప్రజలంతా మా వెంటే : టీడీపీ