ETV Bharat / bharat

'మిషనరీస్​ సేవా కార్యక్రమాలు యథాతథం'

author img

By

Published : Dec 28, 2021, 9:13 PM IST

Missionaries Of Charity News: మిషనరీస్ ఆఫ్​ ఛారిటీకి చెందిన బ్యాంకు ఖాతాలను కేంద్రప్రభుత్వం నిలిపివేయడంపై ఆ సంస్థ స్పందించింది. తమ సేవాకార్యక్రమాలు యథాతథంగా కొనసాగుతూనే ఉంటాయని పేర్కొంది. ఖాతాల ఫ్రీజ్ వ్యవహారాన్ని పరిష్కరించేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలిపింది.

Missionaries Of Charity
మిషనరీస్ ఆఫ్ ఛారిటీ

Missionaries Of Charity News: మదర్​ థెరిసా స్థాపించిన మిషనరీస్​ ఆఫ్ ఛారిటీకి చెందిన బ్యాంకు ఖాతాలను కేంద్రం నిలిపివేయడంపై ఆ సంస్థకు చెందిన ఉన్నతాధికారులు స్పందించారు. తమ సేవలు యథాతథంగా కొనసాగుతాయని తెలిపారు.

"అనాథలకు ఆశ్రయం కల్పించడం, పేదలకు సాయం చేయడం యథాతథంగా కొనసాగుతుంది. భారత్​లో ఇన్నేళ్లపాటు ప్రజల ప్రేమ, అండతోనే ఉండగలిగాం. ఇకపైనా పేదలు, వృద్ధులు, రోగులు, నిరాశ్రయులకు సాయం చేయడం కొనసాగుతుంది." అని మిషనరీస్​ ఆఫ్ ఛారిటీకు చెందిన ఉన్నతాధికారులు వివరించారు.

ఈ వ్యవహారాన్నియథాతథస్థితికి తీసుకొచ్చేందుకు నిపుణులు, ఆడిటర్స్​తో తాము చర్చలు జరుపుతున్నామని అధికారులు తెలిపారు.

మిషనరీస్​ ఆఫ్​ ఛారిటీని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, భారత రత్న మదర్ థెరిసా 1950లో స్థాపించారు. ప్రధాన కార్యాలయం కోల్​కతాలో ఉంది. ప్రపంచదేశాల నుంచి వచ్చిన విరాళాలను ఉపయోగించుకోవడానికి.. ఈ సంస్థకు దేశవ్యాప్తంగా 250 బ్యాంకు ఖాతాలు ఉన్నాయి.

ఇదీ చూడండి: థెరిసా మిషనరీల 'ఖాతాల ఫ్రీజ్'​పై రాజకీయ దుమారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.