ఉత్తర్‌ప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన మిస్ ఇండియా ఫైనలిస్ట్ దీక్షా సింగ్ ఓటమి చవిచూశారు. జౌన్‌పుర్ జిల్లా బక్షాలో బరిలో నిలిచిన దీక్షా.. 2వేల ఓట్లతో ఐదో స్థానంలో నిలిచారు. ఆ ప్రాంతంలో భాజపా మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థి నాగినా సింగ్.. ఐదు వేల ఓట్లతో విజయం సాధించారు.
మౌలిక వసతుల లోపం, మహిళల సంక్షేమం అంశాలను ప్రధాన అస్త్రాలుగా చేసుకుని దీక్షా సింగ్ జిల్లా పంచాయతీ సభ్యురాలి పదవి కోసం పోటీ చేశారు.
జౌన్‌పుర్ జిల్లా బక్షా ప్రాంతంలోని చిట్టోరీ గ్రామానికి చెందిన దీక్షా బాల్యంలోనే ముంబయికి వలస వచ్చారు. 2015లో ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని రన్నరప్‌గా నిలిచారు. కొన్ని సినిమాల్లో, వాణిజ్య ప్రకటనల్లో నటించారు. కొన్ని సినిమాలకు స్క్రిప్ట్ రాయడంలోనూ సహకారం అందించారు.
ఇదీ చదవండి : 'బంగాల్ స్థిరాస్తి చట్టం రాజ్యాంగ విరుద్ధం'