ఉత్తర్‌ప్రదేశ్‌లో తనను వేధిస్తున్నారని ఫిర్యాదు చేసిన బాలికపై.. దాడికి పాల్పడ్డారు ఇద్దరు దుండగులు. బాలిక చెయ్యిని కోసేశారు.
రాయ్‌బరేలీలోని ఉంచాహర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఓ బాలికను.. పొరుగునే ఉన్న ఇద్దరు యువకులు రోజూ వేధింపులకు గురిచేస్తున్నారు. విసుగు చెందిన బాలిక యువకుల తండ్రికి ఫిర్యాదు చేసింది. దీంతో కోపంతో బాలిక ఇంటికి వెళ్లి కత్తులతో దాడి చేశారు దుండగులు. ఆమె చెయ్యికి తీవ్ర గాయాలయ్యాయి.
![miscreaint-cut-hand-of-girl-due-to-opposing-molestation-in-raebareli](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10853494_asdf.jpg)
దాడి అనంతరం తన తండ్రితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది బాలిక. ఈ ఘటనపై వెంటనే కేసు నమోదు చేసుకొని.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అదనపు ఎస్పీ విశ్వజిత్ శ్రీవాస్తవ ఆదేశించారు.
ఇదీ చదవండి: