ETV Bharat / bharat

చిన్నారికి మాయమాటలు చెప్పి గ్యాంగ్​ రేప్​- ఏం జరిగిందో తెలియక... - చిన్నారిపై గ్యాంగ్​ రేప్​

Minor Raped in Ghaziabad: అభం శుభం ఎరగని చిన్నారిపై.. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు. ఇప్పటివరకు పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. గాజియాబాద్​ మురద్​నగర్​లో జరిగిందీ ఘటన.

Two men rape minor in Ghaziabad
Two men rape minor in Ghaziabad
author img

By

Published : Feb 23, 2022, 4:54 PM IST

Minor Raped in Ghaziabad: మైనర్​పై కొందరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన ఉత్తర్​ప్రదేశ్​​ గాజియాబాద్​ పరిధిలోని మురద్​నగర్​లో సోమవారం జరిగింది. ఆ చిన్నారి రెండో తరగతి చదువుతోంది. ఇప్పటివరకు ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారు బాధితురాలికి బంధువులు, ఇంటికి సమీపంలోని వారేనని ప్రాథమిక విచారణలో తేలింది.

పోలీసుల వివరాల ప్రకారం.. చిన్నారికి మాయమాటలు చెప్పి తమ ఇంటికి తీసుకెళ్లిన నిందితులు అక్కడ అత్యాచారానికి ఒడిగట్టారు. దీనిగురించి ఎవరికీ చెప్పొద్దని బెదిరించి.. తిరిగి ఇంటికి పంపించారు. అసలు తనకేం జరిగిందో తెలియని చిన్నారి.. ఇంటికెళ్లి ఏడవడం ప్రారంభించింది. అది చూసిన తల్లిదండ్రులు పలుమార్లు అడగగా.. ఆ చిన్నారి జరిగింది చెప్పింది. హుటాహుటిన పోలీస్​ స్టేషన్​కు వెళ్లిన బాధితురాలి తల్లిదండ్రులు నిందితులపై ఫిర్యాదు చేసి.. ఆమెను వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లారు. ఈ ఘటనలో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి, విచారిస్తున్నారు.

ఇవీ చూడండి: ఇంట్లోంచి లాక్కొచ్చి ప్రేమికులపై తూటాల వర్షం.. పరువు పేరుతో...

రచయిత నిర్వాకం.. మోసాలు చేసి.. వాటిని కథలుగా రాసి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.