ETV Bharat / bharat

Lovers Suicide Siddipet : పెద్దలు ప్రేమకు 'నో' చెబుతారని.. మైనర్ ప్రేమజంట ఆత్మహత్య - Siddipet District

Lovers Suicide at Dubbaka : చిన్న విషయాలకు విలువైన ప్రాణాలు తీసుకుంటున్నారు నేటి తరం పిల్లలు. చదువుకునే విద్యార్థుల నుంచి కాటికి కాలు చాచిన వృద్ధుల వరకూ చాలా మంది తమ సమస్యలకు బలవన్మరణమే పరిష్కారమని భావిస్తూ ప్రాణాలు బలితీసుకుంటున్నారు. సిల్లీ కారణాలతో మనస్తాపం చెంది జీవితాలను అర్ధాంతరంగా ముగిస్తున్నారు. ముఖ్యంగా యువత ఆత్మహత్యలకు ఎక్కువగా పాల్పడుతోంది. ఇక ప్రేమ పేరుతో బలవుతున్న ప్రాణాలకు లెక్కే లేదు.

Minor Lovers Suicide in Dubbaka
Minor Lovers Suicide in Dubbaka
author img

By

Published : Jul 12, 2023, 12:01 PM IST

Minor Lovers Suicide in Siddipet : రాష్ట్రవ్యాప్తంగా ఈ మధ్య కాలంలో వరుసగా జరుగుతున్న ఆత్మహత్యలు తీవ్రంగా కలచి వేస్తున్నాయి. తెలిసీ.. తెలియని వయసు.. చిన్న సమస్య వచ్చినా ఎదుర్కొలేని మనస్సు. ఎక్కడ చూసినా.. కష్టం వస్తే చాలు.. చావే శరణ్యమనుకునే పరిస్థితి. ఇలా చిన్న విషయాలకే ప్రాణాలు తీసుకుంటున్న పిల్లలు.. కన్నవారికి తీరని వేదన మిగుల్చుతున్నారు. ఎవరేమైనా అంటే.. ఆ మాటలను తీసుకునే గుణాన్ని ఈ తరం పిల్లలకు అసలు ఉండటం లేదు. చిన్నచిన్న విషయాలకే మనస్తాపానికి గురై ప్రాణాలు బలి చేసుకుంటున్నారు.

Lovers Suicide in Dubbaka : అమ్మాయి ప్రేమించడం లేదనో.. ప్రేమించిన అమ్మాయి వేరే అబ్బాయిని పెళ్లాడిందనో.. అబ్బాయి మోసం చేశాడనో.. పెద్దలు తమ ప్రేమను అంగీకరించడం లేదనో.. ఇలా ప్రేమ పేరుతో రకరకాల కారణాల వల్ల యువతీయువకులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ప్రేమలో పడి.. కొన్ని రోజుల క్రితం పరిచయమైన వారి కోసం తమను కన్నవారికి కడుపుకోత మిగుల్చుతున్నారు. కలిసి బతకలేనప్పుడు.. కలిసి చావడమే కరెక్ట్ అని భావిస్తూ బలవన్మరణానికి పాల్పడుతున్నారు. తాజాగా మైనర్‌ ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాకలో చోటుచేసుకుంది.

Minor Lovers suicide in Siddipet : పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లచ్చపేటకు చెందిన మైనర్ బాలుడు కూరపాటి భగీరథ(17) (ఇంటర్ ద్వితీయ సంవత్సరం), అదే గ్రామానికి చెందిన మైనర్ బాలిక తోట్ల నేహా(16) (ఇంటర్ మొదటి సంవత్సరం) ఇద్దరు దుబ్బాకలోని ఓ ప్రైవేటు కళాశాలలో చదువుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఒకరినొకరు ఇష్టపడుతూ ప్రేమాయణం కొనసాగించారు.

తల్లిదండ్రులు ప్రేమను ఒప్పుకొరని.. మైనర్ ప్రేమ జంట : ఈ క్రమంలో ఇంట్లో వారికి తెలిస్తే విడదీస్తారనే భయంతో భగీరథ ఇంట్లోనే గత రాత్రి ఎవరూ లేని సమయంలో ఇద్దరు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇది గమనించిన బాలుడి కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతులను దుబ్బాక ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనాస్థలంలో ఓ లేఖ లభ్యమైనట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది. అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలు ఉరి వేసుకుని విగత జీవులుగా మారడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. క్షణికావేశంలో మైనర్ ప్రేమ జంట తీసుకున్న నిర్ణయం రెండు కుటుంబాలలో తీవ్ర విషాదం మిగిల్చింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.