ETV Bharat / bharat

ఆ భయంతో.. తల్లిదండ్రులను నరికి చంపిన బాలుడు! - డ్రగ్స్​కు బానిసైన మైనర్

Minor Killed Parents: నిద్రిస్తున్న తల్లిదండ్రులపై గొడ్డలితో దాడి చేసి హత్య చేశాడు ఓ బాలుడు. ఈ ఘటన రాజస్థాన్​లో జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్​ చేశారు.

minor killed parents
తల్లిదండ్రులను గొడ్డలితో నరికి చంపిన మైనర్
author img

By

Published : Dec 17, 2021, 9:21 AM IST

Minor Killed Parents: డ్రగ్స్​కు బానిసైన ఓ మైనర్​ తనను డీఎడిక్షన్​ సెంటర్​కు తరలిస్తారనే అనుమానంతో కుటుంబసభ్యులను హతమార్చాడు. నిద్రలో ఉన్న తల్లిదండ్రులు, సోదరుడిపైన గొడ్డలితో దాడి చేశాడు. అనంతరం పోలీసులకు లొంగిపాయడు. ఈ ఘటన రాజస్థాన్​లోని హనుమాన్​గఢ్​ జిల్లా ఫేఫానా గ్రామంలో బుధవారం అర్ధరాత్రి జరిగింది.

ఇదీ జరిగింది..

డ్రగ్స్​కు బానిసైన నిందితుడు కిశోర్​ను ఇటీవల డీఎడిక్షన్​ సెంటర్​లో​ చేర్చించారు అతని కుటుంబసభ్యులు. బుధవారమే అతను మళ్లీ ఇంటికి తిరిగివచ్చాడు. అయితే తనను మరోసారి డీఎడిక్షన్​ సెంటర్​లో చేర్పిస్తారనే అనుమానంతో అర్ధరాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో తల్లిదండ్రులైన ఇంద్రా-శశిపాల్​ సహా తమ్ముడు అజయ్​పైన గొడ్డలితో అతికిరాతకంగా దాడి చేశాడు. కిశోర్​ తల్లిదండ్రులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. అతని సోదరుడి పరిస్థితి విషమించింది. అయితే సోదరుడు కూడా చనిపోయాడని భావించిన కిశోర్​.. స్థానిక పోలీస్​స్టేషన్​కు వెళ్లి లొంగిపోయాడు.

ఘటనాస్థలానకి చేరుకుని కిశోర్​ తల్లిదండ్రుల మృతదేహాలను పోస్ట్​మార్టంకు తరలించిన పోలీసులు.. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న అతని సోదరుడు అజయ్​ను ఆసుపత్రిలో చేర్చారు. కిశోర్​ వాడిన గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు కిశోర్​ను అరెస్ట్​ చేశారు. చికిత్స పొందుతున్న అజయ్​ పరిస్థితి ప్రస్తుతం విషమంగానే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి : బోరుబావిలో పడిన చిన్నారి కథ సుఖాంతం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.