ETV Bharat / bharat

ఏడేళ్ల చిన్నారిపై హత్యాచారం.. చెరుకు తోటలో మృతదేహం!

Up Rape News: ఉత్తర్​ప్రదేశ్​లో ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేశారు దుండగులు. మరో కేసులో 17 ఏళ్ల బాలికను కిడ్నాప్​ చేసి అత్యాచారం చేశారు. ముజఫర్​నగర్​, మొరదాబాద్​ ప్రాంతాల్లో ఈ దారుణ ఘటనలు జరిగినట్లు పోలీసులు తెలిపారు. వరకట్న వేధింపుల ఘటనలో ఓ వివాహిత అత్తారింట్లో వేలాడుతూ శవమై కనిపించింది.

Minor girl raped, killed in Moradabad
బాలిక అత్యాచారం
author img

By

Published : Dec 26, 2021, 1:13 PM IST

Up Rape News: ఉత్తర్​ప్రదేశ్​ మొరదాబాద్​లో దారుణం జరిగింది. 7 ఏళ్లు చిన్నారిని కిడ్నాప్​ చేసిన దుండగులు అత్యాచారం చేసిన చంపేసినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని కాంత్ ప్రాంతంలో ఉండే చెరుకు తోటల్లో బాలిక మృతదేహాన్ని గుర్తించిన ఓ రైతు పోలీసులకు సమాచారం అందించినట్లు పేర్కొన్నారు.

మృతదేహానికి శవ పరీక్ష నిర్వహించిన వైద్యులు.. చిన్నారిపై అత్యచారం జరిగినట్లు నిర్ధరించారు. బాలిక ఆచూకీ తెలియడం లేదని తల్లిదండ్రులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోక్సో, ఐపీసీ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. త్వరలోనే దోషులను పట్టుకుంటామన్నారు. మొరాదాబాద్​ ఎంపీ ఎస్​టీ హసన్​ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.

17 ఏళ్ల బాలికపై అత్యాచారం..

ఉత్తర్​ప్రదేశ్​లోని ముజఫర్​నగర్​లో ఓ యువకుడు 17 ఏళ్ల బాలికను కిడ్నాప్​ చేసి అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడ్ని అక్షిత్​గా పోలీసులు గుర్తించారు. అయితే నిందితుడు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే గ్రామం నుంచి బాలికను నాలుగు రోజుల క్రితం అక్షిత్​ కిడ్నాప్​ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు వెతకగా.. గ్రామానికి సమీపంలో ఉండే ప్రాంతంలో బాలిక అపస్మారక స్థితిలో ఉండడాన్ని గుర్తించారు. కొద్దిసేపటి తరువాత తేరుకున్న బాలిక.. అక్షిత్​ అత్యాచారానికి పాల్పడినట్లు వివరించింది. నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు వేట మొదలు పెట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.

వరకట్న వేధింపులతో బలైన 30 ఏళ్ల వివాహిత

ఉత్తర్​ప్రదేశ్​లోని షామ్లీ​లో వరకట్న వేధింపులకు 30 ఏళ్ల వివాహిత బలైది. షామ్లీ తన అత్తమామల ఇంట్లో మహిళ మృతదేహం ఉరివేసుకుని కనిపించింది. అయితే వరకట్నం వివాదం కారణంగా ఆమె భర్తే హత్య చేసినట్లు వివాహిత తల్లిదండ్రులు ఆరోపించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ యువతి కుటుంబ సభ్యులు నిరసనకు దిగారు.

ఝింజానా పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ఘరీవాల చౌక్​లోని ఓ కాటేజ్​లో జితేందర్​ కుమార్​ అనే వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. దీనిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: మోదీ నిర్ణయం కరెక్ట్​.. నేను చెప్పినట్టే చేశారు: రాహుల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.