ETV Bharat / bharat

Viral: మైనర్​ను కొట్టి.. చీర కట్టించి!

స్త్రీలాగా చీర కట్టుకోవాలని ఓ మైనర్​ను ఒత్తిడి చేశారు కొందరు గ్రామస్థులు. ఈ ఘటన రాజస్థాన్​ సికర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే...

minor, rajasthan
మైనర్, రాజస్థాన్​ బాలుడు
author img

By

Published : Jun 10, 2021, 1:31 PM IST

మైనర్​ను కొట్టి.. చీర కట్టించిన గ్రామస్థులు

స్త్రీలాగా వేషధారణ మార్చుకోవాలని మైనర్​ను బలవంతం చేశారు కొందరు గ్రామస్థులు. 'గాగ్రా-చున్నీ' బట్టలు వేసి గాజులు తొడిగారు. రాజస్థాన్​ సికర్ జిల్లా పటాన్ పోలీస్​స్టేషన్​ పరిధిలోని నీమ్​కాథానా టౌన్​లో ఈ ఘటన జరిగింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

minor humiliated
బాలుడిని చితకబాదిన గ్రామస్థులు

ఇదీ జరిగింది..

గ్రామానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడని.. నీమ్​కాథానా టౌన్​ వారు తమ మనిషిని బందీ చేశారని బాధితుడి సోదరుడు ఆరోపించాడు. తీవ్రంగా కొట్టి.. తన సోదరుడికి చీరకట్టించారని పటాన్​ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. 10-15మంది ప్రతీకారం తీర్చుకునేందుకు ఇలా చేశారని పేర్కొన్నాడు. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్​ అయిన తర్వాత.. బాధితుడిని వదిలేసేందుకు కొంత డబ్బు కూడా ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలిపాడు.

minor humiliated
చీరకట్టి.. గాజులు తొడిగి

ఈ ఘటనపై స్పందించిన పోలీసులు.. బాధితుడి సోదరుడు జూన్ 7న కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మైనర్​ను కాపాడినట్లు పేర్కొన్నారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:వింత ప్రేమకథ- పదేళ్లుగా ఒకే గదిలో యువతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.